ఆంధ్రప్రదేశ్‌

కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, సెప్టెంబర్ 16: కర్నూలు జిల్లాలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. నంద్యాల డివిజన్‌లోని పలు మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నల్లమల అడవిలో కురిసిన వర్షం కారణంగా అటవీ సాలు వాగులలోని వర్షపు నీరు కుందూనదిలో కలవడంతో అప్పటికే కుందూనదిలో ప్రవహిస్తున్న 20 వేల క్యూసెక్కుల కృష్ణాజలాలకు వర్షపు నీరు తోడవడంతో భారీ వరద వచ్చింది. ఉయ్యాలవాడ మండలంలోని 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆళ్లగడ్డ పట్టణంలోని గురుకుల పాఠశాలలోకి వరద రావడంతో విద్యార్థినులు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉదయం వారిని సురక్షితంగా తరలించారు. వరదలో చిక్కుకున్న ఓ వ్యక్తిని గ్రామస్తులు కాపాడారు. డివిజన్‌లో శిరివెళ్లలో
అత్యధికంగా 227.6 మిల్లీమీటర్లు, గోస్పాడు మండలంలో 226.4 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. నంద్యాల పట్టణంలో భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ కాలువలుగా మారాయి. శివారు కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. శిల్పానగర్, గాంధీనగర్, గట్టాన్‌నగర్, హరిజనపేట, బైటిపేట, రాణి, మహరాణి ప్రాంతాల్లో వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో దుస్తులు, నిత్యావసరాలు తడిసిపోయి జనం ఇబ్బంది పడ్డారు. పట్టణ శివారులోని మద్దిలేరు పొంగి పొర్లడంతో 7 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే శిరివెళ్ల, గోస్పాడు, ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఉయ్యాలవాడ మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లడంతో, కుందూనదికి భారీ వరద వచ్చి పంట పొలాలు నీట మునిగాయి. ఉయ్యాలవాడ మండలం పెద్దయమ్మనూరు గ్రామ సమీపంలో కుందూ ప్రవాహానికి జలదిగ్బంధంలో చిక్కుకున్న తలారి ఓబులేసుని గ్రామస్తులు రక్షించారు. కుందూనది వరద నీటితో పోటెత్తడంతో ఉయ్యాలవాడ మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పంటపొలాలు చెరువులను తలపించాయి. హరివరం, ఉయ్యాలవాడ గ్రామాల సమీపంలో వంతెనపై వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వకుళానది పొంగిపొర్లడంతో ఆళ్లగడ్డ మండలంలో పంటపొలాలు నీట మునిగాయి. పట్టణ సమీపంలోని బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థినులు దాదాపు 580 మంది వరద నీటిలో చిక్కుకున్నారు. అర్ధరాత్రి వర్షం కురవడంతో వకుళానదికి అధికంగా వచ్చిన వరదనీరు పాఠశాలలోకి చేరింది. దీంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. ప్రిన్సిపాల్ లక్ష్మి ప్రసూన పడకండ్ల గ్రామస్థులు, మున్సిపల్ సిబ్బంది సహకారంతో కళాశాల ప్రహరీ పగులగొట్టించి పిల్లలను గిరిజన పాఠశాలలోకి తరలించారు. అక్కడి నుంచి పంచాయతీ కార్యాలయంలోకి తరలించారు. చాగలమర్రి నుండి మల్లెవేముల మీదుగా ప్రొద్దుటూరు వెళ్లే రహదారిలో వంకలు పొంగడంతో ఆర్‌టీసీ బస్సులు తిరగక ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఉయ్యాలవాడలో వరద పరిస్థితిని నంద్యాల ఆర్‌డీఓ రామక్రిష్ణారెడ్డి, గోస్పాడు మండలంలో జాయింట్ కలెక్టర్ రవిపఠాన్‌శెట్టి పర్యవేక్షించారు. అకస్మాత్తుగా వచ్చిన వరద కారణంగా ముంపుకు గురైన గ్రామాలలో బాధితులకు పునరావస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక సహాయం అందజేయాలని రెవెన్యూ మండలాధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. జేసీ రవిపఠాన్‌శెట్టి గోస్పాడు, యాళ్లూరులలో అధికారులను వెంటబెట్టుకుని వరద నష్టాన్ని సమీక్షించారు. వరద బాధితులకు మంచినీరు, ఆహారం సరఫరా చేయాలని ఆదేశించారు. గోస్పాడు, శిరివెళ్ల, ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ మండలాల్లో వరద నష్టం ఎక్కువగా వుందని ప్రజలు ఎవ్వరూ భయాందోళనకు గురికావలసిన అవసవరం లేదని, అన్ని సహాయక చర్యలు చేపడుతామని జేసీ తెలిపారు. పాఠశాలల్లోకి వర్షపు నీరు వచ్చిన చోట్ల స్థానిక సెలువులు ప్రకటించామన్నారు. మరో 3 రోజుల పాటు నంద్యాల డివిజన్‌లో వర్షం కురిసే అవకాశం వుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

*చిత్రం... ఉయ్యాలవాడ-రూపనగుడి గ్రామాల మధ్య వంతెన పైనుంచి ప్రవహిస్తున్న కుందూ నది