ఆంధ్రప్రదేశ్‌

నా తండ్రి మృతిపై అనుమానాల్లేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తన తండ్రి కోడెల శివప్రసాద్ మృతిపై ఎటువంటి అనమానాలు లేవని ఆయన కుమార్తె విజయలక్ష్మి తెలిపారు. విజయలక్ష్మి స్టేట్‌మెంట్‌ను బంజారాహిల్స్ పోలీసులు రికార్డు చేశారు. తన తండ్రి చాలా ఒత్తిడిలో ఉన్నారని, ఆయన మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని ఆమె చెప్పినట్టు సమాచారం. సోమవారం ఉదయం తమ ఇంట్లో కింద నుంచి ఫస్ట్ఫో్లర్‌కు కోడెల వెళ్లారని, అరగంట సమయం దాటినా ఆయన కిందకు రాకపోవడంతో తనకు అనుమానం వచ్చిందని, పైకి వెళ్లి చూసేసరికి తన తండ్రి ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని తాను గమనించినట్టు చెప్పారు. గన్‌మెన్, డ్రైవర్ సాయంతో తన తండ్రిని ఆసుపత్రికి తరలించామని ఆ స్టేట్‌మెంట్‌లో విజయలక్ష్మి పేర్కొన్నట్లు తెలిసింది.