ఆంధ్రప్రదేశ్‌

గోదావరిలో కొనసాగుతున్న గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 16: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరుమందం వద్ద ఆదివారం గోదావరిలో టూరిజం బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం సోమవారం ముమ్మరంగా గాలింపుచర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ, నౌకాదళం, పోలీసు బృందాలు గల్లంతైన వారి కోసం గోదావరి నదిలో కాఫర్ డ్యాం వద్ద నుండి కచ్చులూరు వరకు జల్లెడ పట్టాయి. ఇంకా నదిలో సుమారు నాలుగు లక్షల కూసెక్కుల నీరు ప్రవహిస్తుండటంతో గాలింపుచర్యలకు కష్టసాధ్యమవుతోంది. రెండంతస్తుల లాంచీ బోల్తా ప్రమాదంలో ఆదివారం 27 మందిని రక్షించగా, ఎనిమిది మృతదేహాలు లభ్యమయ్యాయి. 38మంది గల్లంతయ్యారు. అయితే సోమవారం నాటి గాలింపులో ఎవరి ఆచూకీ తెలియరాలేదు. పశ్చిమ గోదావరి జిల్లా తూటిగుంట సమీపంలో రోజుల వయసున్న పసికందు మృతదేహాన్ని మాత్రం గుర్తించారు. కాన్పు సమయంలో వైద్యులు బొడ్డుకు వేసే క్లిప్ కూడా ఉండటంతో ఈ ప్రమాదానికి సంబంధించిన మృతదేహం కాకపోవచ్చని భావిస్తున్నారు.
ప్రమాదం జరిగిన ప్రాంతం సమాచార సౌకర్యం లేని ప్రాంతం కావడంతో ఐదు శాటిలైట్ ఫోన్ల సాయంతో సమాచారం రాబడుతున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి, వైసీపీ జిల్లా యువజన అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ సోమవారం ఉదయం దేవీపట్నం చేరుకుని, అక్కడి నుండి ప్రత్యేక బోటులో ప్రమాద స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాగా ఆదివారం లభ్యమైన ఎనిమిది మృతదేహాలకు సోమవారం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించి, స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లుచేశారు. ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతం వద్ద బోటు 315 అడుగుల లోతులో కూరుకు పోయినట్టు గుర్తించారు. దీంతో ప్రత్యేక నిపుణులతో ఈ లాంచీని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. ఏసీ లాంచీ కావడంతో లాంచీలోనే చాలా మంది వరకు వుండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రైవేటు లాంచీ యజమానిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంలో గల్లంతైన వారిలో ఎంతమంది తెలంగాణవాసులున్నారనేది ఇంకా నిర్ధారణ కాలేదు. తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, పువ్వాడ అజయ్ రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని, బాధితులను పరామర్శించారు. సీపీఎం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, జనసేన అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఎన్వీ శ్రీనివాస్ తదితరులు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు.
*చిత్రం... గాలింపు చర్యల్లో సహాయ బృందాలు