ఆంధ్రప్రదేశ్‌

ఉపాధి పథకం నిర్వీర్యం: డొక్కా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 14: జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా విడుదల చేయకుండా మురగ బెడుతున్నారంటూ విజయవాడ టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖర్ల సమావేశంలో డొక్కా మండిపడ్డారు. ఈ ఏడాది సెప్టెంబర్ 4, మే 10 తేదీల్లో కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూలీలు, కాంట్రాక్టర్లకు చెల్లించకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన రూ. 2,700 కోట్లను ఇంత వరకు కూలీలకు, కాంట్రాక్టర్లకు చెల్లించలేదని, పేద ప్రజల పొట్టకొట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం కూలీలు పని చేసిన మూడు రోజుల్లోపే వేతనాలు చెల్లించాలని లేని పక్షంలో 12 శాతం అధిక మొత్తంతో వేతనాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కానీ మూడు నెలలైనా ప్రభుత్వం వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తూ పేద ప్రజల పొట్టకొడుతోందన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ పాల్గొన్నారు.