ఆంధ్రప్రదేశ్‌

క్రీడలకు పెద్దపీట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 14: ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. శనివారం పట్టణంలోని రాజీవ్ స్టేడియంలో రాష్టస్థ్రాయి సీఎం కప్ ఖోఖో పోటీలను ఆయనతోపాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. శారీరకంగా, మానసికంగా దృఢత్వం లేకపోవడం వల్లనే చిన్నపాటి సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మానసిక స్థైర్యం పెరగాలంటే వ్యాయామం, క్రీడలు ఎంతో అవసరమన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెంపొందించేందుకు వౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామన్నారు. విజయనగరం జిల్లాలో కబడ్డీ అకాడమీ మంజూరుకు చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీలు ఇక్కడ నిర్వహించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాకారులు బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వరుసగా నాలుగుసార్లు ఓటమిపాలైనా ఐదోసారి ప్రయత్నించి ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్ర, జాతీయస్థాయిల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్నారని, ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పట్టణంలోని రాజీవ్ స్టేడియం క్రీడాకారులకు ఒక వరమని, దీనిని ఉపయోగించుకొని క్రీడాకారులు మంచి విజయాలు సాధించాలన్నారు. ఈ స్టేడియంలో మరిన్ని వసతులు కల్పించే దిశగా తాను కృషి చేస్తానన్నారు. విద్యార్ధులు ఉత్సాహంగా ఉండాలంటే వారికి క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరమన్నారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ మత్స సంతోషి వంటి ఎందరో క్రీడాకారులు జిల్లా నుంచి వచ్చారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ రఘువర్మ, జెసిఆర్ కూర్మనాథ్, సెట్విజ్ సీఈవో నాగేశ్వరరావు, ఓఎస్‌డీ రామ్మోహన్ పాల్గొన్నారు.
*చిత్రం... రాష్టస్థ్రాయి సీఎం కప్ ఖోఖో పోటీలను ప్రారంభిస్తున్న మంత్రులు అవంతి, బొత్స, పుష్ప శ్రీవాణి