ఆంధ్రప్రదేశ్‌

పారిశ్రామికవాడల్లో వ్యర్థాల నిర్వహణ ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 14: రాష్ట్రంలోని వివిధ పారిశ్రామికవాడల్లో పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ అధ్వాన్నంగా ఉండటంపై పురపాలక శాఖ దృష్టి సారించింది. ఇది స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల అమలులో ప్రభావం చూపిస్తుండటంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద నగరాలు, పట్టణాల్లో ఉత్పత్తయ్యే ఘన వ్యర్థాలను శాస్ర్తియంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇళ్ల నుంచి నేరుగా చెత్త సేకరణ, తడి, పొడి చెత్తగా విభజించడం, వాటిని శాస్ర్తియంగా తదుపరి ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. పట్టణాల్లో ఘన వ్యర్థాల నిర్వహణపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దృష్టి సారించింది. శత శాతం ఘన వ్యర్థాలను ఇళ్ల నుంచి సేకరించి నిర్వహించే అంశంపై పురపాలక శాఖ దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసిన కాకినాడ, తిరుపతి, విశాఖ నగరాల్లో చెత్తను ఇళ్ల నుంచి నేరుగా సేకరించే ప్రక్రియ ప్రారంభించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కింద మెరుగైన ర్యాంక్ సాధించిన విజయవాడ కూడా ఇళ్ల నుంచి నేరుగా చెత్త సేకరణ ప్రక్రియ కొన్ని చోట్ల ప్రారంభించింది. ఘన వ్యర్థాల నిర్వహణలో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌ల్లో 2018తో పోలిస్తే 2019లో ఈ నగరాలు వెనుకబడ్డాయి. వచ్చే ఏడాది మరింత మైరుగైన ర్యాంకింగ్ సాధించే అంశంపై దృష్టి పెట్టాయి. విజయవాడ నగరానికి సంబంధించి 5వ ర్యాంక్ నుంచి 12కు పడిపోయింది. ప్రధానంగా పారిశుద్ధ నిర్వహణ కొన్ని ప్రాంతాల్లో సరిగా లేకపోవడంతో ర్యాంక్ తగ్గింది. విజయవాడ నగరంలో జవహర్ ఆటోనగర్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడం ఇటీవల జరిగిన మున్సిపల్ కమిషనర్ల వర్కుషాపులో ప్రస్తావనకు వచ్చింది. ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉండటం, చెత్త సేకరణ అమలు కాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఐలా పరిధిలోని పారిశ్రామిక యూనిట్ల నుంచి వసూలు చేసిన పన్నుల్లో 35 శాతం నగర పాలక సంస్థలకు చెల్లిస్తాయి. పన్నుల ద్వారా సమకూరిన నిధులతో పారిశుద్ధ్య నిర్వహణను ఐలా చేపడుతుంది. కానీ నిధుల కొరత కారణంగా తగినంత మంది పారిశుద్ధ్య సిబ్బంది, చెత్త తరలింపు వాహనాలు లేక చెత్త కుప్పలు పేరుకుపోతుంటాయి. మురుగు కాలువలు శుభ్రం చేసే పరిస్థితి ఉండటం లేదు. చెత్తను చాలా సందర్భాల్లో తగులబెడుతున్నారు. దీని వల్ల పారిశ్రామిక వ్యర్థాలు కూడా మండి పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఇదే పరిస్థితి దాదాపు అన్ని ఆటోనగర్‌ల్లో ఉండటంతో దీనిపై పురపాలక శాఖ దృష్టి సారించింది. ఐలా పరిధిలో ఉన్న ఆటోనగర్‌ల్లో పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణపై ఒక విధాన నిర్ణయం తీసుకునే దిశగా పురపాలక శాఖ యోచిస్తోంది.