ఆంధ్రప్రదేశ్‌

జాతీయ మహిళా కమిషన్‌కు నన్నపనేని వ్యవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 14: మహిళలపై జరిగే దురాగతాలపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైతే చట్ట సవరణకు ప్రతిపాదించనున్నామని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. కొన్ని కేసుల్లో విచారణ, శిక్షలు సరిగా అమలుజరగక పోవడంవల్లే మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతుందన్నారు. రాజ్యాంగంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలని, ఉన్న చట్టాలు సమర్ధవంతంగా వినియోగించాల్సి వుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ అతిథిగృహంలో శనివారం ఆమె విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్ర మహిళా కమిషన్ పూర్వ ఛైర్‌పర్సన్, సీనియర్ రాజకీయవేత్త నన్నపనేని రాజకుమారి గుంటూరు జిల్లా పెదకాకాని మహిళా ఎస్సై అనురాధను దూషించిన ఘటనపై సమగ్ర నివేదికను పోలీసుల నుంచి కోరామన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి, జాతీయ మహిళా కమిషన్ దృష్టికి కూడా ఈ ఘటనను తీసుకెళ్తున్నామన్నారు. తనను కులం పేరుతో దూషించారని ఎస్సై అనురాధ కేసు పెట్టారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కొన్ని దళిత సంఘాలు మహిళా కమిషన్‌కు ఫిర్యాదుచేశాయన్నారు. ఉన్నత స్థానంలో ఉన్నవారు కుల భావాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం తగదని పద్మ పేర్కొన్నారు. మహిళల రక్షణకు పోలీసు యంత్రాంగానికి తోడుగా అందరి మద్దతుతో కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానంగా విద్యాసంస్థల్లో కౌనె్సలర్‌ను అందుబాటులో ఉంచాలని కోరుతున్నామన్నారు. అమ్మాయిలపై జరిగే వేధింపులను బయటకు చెప్పలేక పోతున్నారని, తద్వారా చదువులో వెనుకబడి పోతున్నారని యూనిసెఫ్ అధ్యయన నివేదిక చెబుతోందన్నారు. గోదావరి జిల్లాల్లో గత ఐదేళ్ళ కాలంలో పరిశీలిస్తే మహిళలపై నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 జూలై వరకు పరిశీలిస్తే మహిళలపై వేధింపుల కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయని, అదేవిధంగా లైంగిక దాడులు కూడా అధికంగా నమోదయ్యాయన్నారు. మద్యపాన నియంత్రణకు రాష్ట్రంలో జరుగుతున్న దశలవారీ కృషిని మహిళా కమిషన్ స్వాగతిస్తోందన్నారు. నియంత్రణ చర్యలు వేగవంతంచేయాలని తాము సిఫార్సు చేస్తామన్నారు. విలేఖర్ల సమావేశంలో న్యాయవాది పద్మావతి తదితరులు పాల్గొన్నారు.