ఆంధ్రప్రదేశ్‌

వచ్చే జనవరిలో డీఎస్సీ నియామకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, సెప్టెంబర్ 14: వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రంలో డిఎస్సీ నియామకాలు చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎపిపియుఎస్‌ఎంఎ (ఆపుస్మా) ఆధ్వర్యంలో మంత్రి సురేష్‌కు శనివారం ఆత్మీయ సన్మానం జరిగింది. ఈసందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ డిఎస్సీ నియామకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలతోపాటు జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు కూడా అమ్మఒడి పథకాన్ని వర్తింప చేస్తామన్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో ముఖ్యమంత్రి 6,546 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. విద్య వ్యాపారం కాకూడదనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. సేవాభావంతో విద్యాసంస్థలు నిర్వహించే వారికి సహకారం అందిస్తామన్నారు. పేదరికంతో ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని అన్నారు. అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లోకి వచ్చే నగదు బ్యాంకుల్లో అప్పులకు జమ కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. 2020-21 విద్యా సంవత్సరంలో 1 నుంచి 6వ తరగతి వరకు, 2021-22 విద్యా సంవత్సరంలో 9 నుంచి 10 తరగతుల సిలబస్‌ను మార్చనున్నట్లు తెలిపారు. ప్రతి 1వ, 3వ శనివారాలు నో బ్యాగ్ డేగా పాటించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రతి పాఠశాల కచ్చితంగా ఈ నియమాన్ని అమలు చేయాలన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. ఆనంద వేదిక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు పాఠశాలలు కూడా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని అన్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చామని, పోస్టింగ్‌లను కూడా క్రమబద్ధీకరించి డిఎస్సీ నియామకాలు చేపడతామని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమంపై కూడా దృష్టి పెట్టనున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు.