ఆంధ్రప్రదేశ్‌

ప్రజాధనం దుర్వినియోగం కారాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తామని రాష్ట్ర జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ బీ శివశంకర్‌రావు స్పష్టం చేశారు. సచివాలయం రెండో బ్లాక్‌లో ఏర్పాటు చేసిన చాంబర్‌లో వేదమంత్రోచ్ఛారణల నడుమ శనివారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఆయనను జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. బాధ్యతల స్వీకరణ అనంతరం జస్టిస్ శివశంకర్‌రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా తొలిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీ ఏర్పాటు చేయటం.. దానికి తనను చైర్మన్‌గా నియమించటంతో రాష్ట్రానికి సేవలందించే వీలు కలిగిందన్నారు. జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టాన్ని అనుసరించి రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులను పారదర్శకంగా మరింత వేగవంతంగా ముందుకు తీసుకువెళుతూ, పర్యావరణ పరిరక్షణను కాపాడుతూ సకాలంలో పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రతి పైసాకు జవాబుదారీగా ఉండేలా చట్టాన్ని అనుసరించి విధులను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. వివిధ ప్రాజెక్టులు పారదర్శకతతో నాణ్యతా ప్రమాణాలతో పూర్తికాగలవనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేయాలని కోరారు. రాజ్యాంగంలోని 51ఏ నిబంధన మనకు కల్పించిన హక్కుల గురించి తెలియజేస్తోందని, హక్కులతో పాటు ప్రతి పౌరుడు వారి బాధ్యతలు కూడా సక్రమంగా నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్, కమిషనర్ సిద్ధార్థ్ జైన్, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి మనోహర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
*చిత్రం...జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న జస్టిస్ శివశంకరరావు