ఆంధ్రప్రదేశ్‌

సచివాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 12: గతంలో పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ ఈడీ సాంబశివరావును వెలగపూడి సచివాలయం వద్ద గురువారం సబ్‌కాంట్రాక్టర్లు, ఉద్యోగులు అడ్డుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తమకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాలని సబ్ కాంట్రాక్టర్లు, సామగ్రి సరఫరాదారులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమకు దాదాపు 23 కోట్ల రూపాయల చెల్లింపులు చేయాల్సి ఉందని తెలిపారు. రెండేళ్లుగా బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారని, హైదరాబాద్‌లోని కార్యాలయానికి వెళితే, పోలీసులతో బయటికి గెంటివేయిస్తున్నారని తెలిపారు. సగం బిల్లుల చెల్లింపులకు ఒప్పుకోవాలని తమతో రాయించుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లు రాగానే ఈ మొత్తాన్ని చెల్లిస్తామని సాంబశివరావు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సాంబశివరావును అక్కడి నుంచి పోలీసులు పంపించివేశారు.