ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ టెండర్లపై న్యాయ సమీక్షకు హైకోర్టు న్యాయమూర్తి నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 11: ప్రభుత్వ టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా న్యాయ సమీక్ష చట్టం అమలుకు హైకోర్టు న్యాయమూర్తి బీ శివశంకరరావును రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. 100కోట్ల రూపాయలకు పైబడిన టెండర్లు న్యాయ సమీక్ష ప్రక్రియకు వెళతాయి.
పాలనలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేసేందుకు వీలుగా ఒక జడ్డిని సూచించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈమేరకు ఆయన పేరును సిఫారసు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లు ఆయన పదవిలో కొనసాగుతారు. టెండరు పత్రాలను న్యాయమూర్తి పరిశీలనకు పంపుతారు. తరువాత వాటిని 7రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. తరువాత దీనిపై వచ్చిన సూచనలు, సలహాలను 8రోజులు పరిశీలించి టెండరు పత్రాలను ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియకు 15రోజుల సమయం కేటాయించారు.
ఉత్తర ఆమెరికాలో
ఏపీ ప్రతినిధిగా రత్నాకర్
ఉత్తర ఆమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా కడప జిల్లా రాజంపేటకు చెందిన పండుగాయల రత్నాకర్‌ను ప్రభుత్వం నియమించింది. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పదవీకాలం, తదితర అంశాలు త్వరలో ఖరారు చేయనుంది. ప్రస్తుతం ఆయన వైకాపా (అమెరికా) కన్వీనర్‌గా పనిచేస్తున్నారు.
బీసీ కమిషన్ చైర్మన్ నియామకం
ఏపీ శాశ్వత బీసీ కమిషన్ చైర్మన్‌గా విశ్రాంత న్యాయమూర్తి శంకర నారాయణను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. బీసీ కమిషన్ బిల్లు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం పొందింది. మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు.