ఆంధ్రప్రదేశ్‌

గత ఐదేళ్లూ పల్నాడులో రౌడీ రాజ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 11: గత ఐదు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ హయాంలో పల్నాడు ప్రాంతంలో రౌడీ రాజ్యమే నడిచిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆ ప్రాంతంలో ఉన్న సహజ వనరులను దోచుకుంటూ, కొత్త పరిశ్రమలు రాకుండా టీడీపీ దొంగల ముఠా కుట్రలు చేసిందని బుధవారం ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ప్రస్తుత వైసీపీ పాలనలో అన్ని ప్రాంతాలు ప్రశాంతంగా ఉంటే టీడీపీ నేతలు మాత్రం ఓర్చుకోలేక పోతున్నారని దుయ్యపట్టారు. ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని రచ్చ చేయడం ద్వారా రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం టీడీపీ నేతలు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమాలు, అన్యాయాలు చేసిన యరపతినేని, కోడెలను రక్షించుకునేందుకే చంద్రబాబు ఛలో ఆత్మకూరు డ్రామా ఆడుతున్నారని మండి పడ్టారు. పేదల జోలికి వస్తే ఉరుకోనని చంద్రబాబు చెబుతుంటే, ఆయన దృష్టిలో కోడెల, యరపతినేని, చింతమనేని, నారాయణ వంటి వారే నిరుపేదలని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజలు తీర్పుతో అఖండ మెజారిటీతో గెలిచిన వైసీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ఇటువంటి కుట్రలు మరే దేశం, మరే రాష్ట్రంలోనూ చూడలేదన్నారు. దొంగే...దొంగ, దొంగ అని గోలపెట్టడంలో చంద్రబాబు పాత ట్రిక్కులనే మళ్లీ మళ్లీ ప్లే చేస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు చంద్రబాబు ఇదే విధానం అమలు చేశారని, ప్రతిపక్షంలో ఉండి కూడా ఇప్పుడు అదే చేస్తున్నారన్నారు. దళితులుగా పుట్టలని ఎవరైనా కోరుకుంటారా.. అని గతంలో వ్యాఖ్యానించిన చంద్రబాబు, ఇప్పుడు వాళ్ల కోసమే ఛలో ఆత్మకూరు అంటున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ పాలన సమయంలో ముద్రగడను హౌస్ అరెస్ట్ చేసిన సమయంలో, ఆడవాళ్లను పోలీసులతో బూతులు తిట్టించిన సమయంలో చంద్రబాబుకు హక్కులు గుర్తుకు రాలేదా విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఐదు సంవత్సరాల పాటు అరాచక పాలన సాగించిన చంద్రబాబుకు ఇప్పుడు ప్రజాస్వామ్య విలువలు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు.