ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ అరాచకాల వల్లే ప్రజలు చాపచుట్టి కృష్ణాలో పడేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 11: ప్రశాంతంగా ఉన్న పల్నాడులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శాంతిభద్రతల సమస్యలు సృష్టించాలని చూస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు దొంగదీక్ష, కొంగజపాలను ప్రజలు నమ్మరన్నారు. పచ్చనేతల చిల్లర రాజకీయాలు తెలిసే టీడీపీనే ప్రజలు చాపచుట్టి కృష్ణానదిలో పడవేశారని చురకలు అంటించారు.
టీడీపీ శిబిరాల నుండి కార్యకర్తలు వెళ్లిపోతే పచ్చనేతలు బెదిరించి కూర్చోబెడుతున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పునరావాస శిబిరాల్లోనూ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టిన సిగ్గుమాలిన రాజకీయం చంద్రబాబుదని ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడు అహంభావంతో పోలీసు అధికారులను దూషించారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు ఇంకా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారని, పోలీసు అధికారులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఊరుకునేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కోడెల, యరపతినేని కుటుంబాల చేతిలో పల్నాడు నలిగిపోయిందని, జగన్ పాలనలో ప్రస్తుతం ప్రశాంతంగా ఉందన్నారు. ఒక్క రాజకీయ దాడి ఘటన కూడా చోటుచేసుకోలేదన్నారు. కృష్ణాకు భారీగా జలాలు వచ్చాయని, యువతకు ఉద్యోగాలు వచ్చాయని, అంతా ప్రశాంతంగా ఉందని మంత్రి మోపిదేవి స్పష్టం చేశారు.