ఆంధ్రప్రదేశ్‌

అభద్రతాభావంతో జగన్ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 11: రాష్ట్ర ప్రజలను ఎంతో ఉద్ధరిస్తాను అంటూ బీరాలు పోయిన సీఎం జగన్ పూర్తి అభద్రతాభావంతో పాలన సాగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటా అని చెప్పి, వంద రోజులకే చేతులేత్తేశారని బుధవారం ట్విట్టర్ వేదికగా వెంకన్న ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తల దాడులతో భయబ్రాంతులకు గురవుతున్న బాధితులకు భరోసా కల్పించేందుకు మాజీ సీఎం చంద్రబాబు ఛలో ఆత్మకూరు కార్యక్రమం నిర్వహిస్తుంటే ఆయనను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ట్విట్టర్‌లో ట్యాగ్ చేసిన వెంకన్న 420 తాతయ్యా అంటూ సంబోధిస్తూ, సీఎం జగన్‌ను తుగ్లక్‌తో పోలుస్తూ ట్విట్ చేశారు. మీ తుగ్లక్‌కి ఇంత అభద్రతాభావం ఉందని ఆస్సలు ఉహించలేదన్నారు. ఈ నిర్బంధాలు, మీడియా అంక్షలు మీ సలహానే కదా అంటూ ప్రశ్నించారు.
దొంగ లెక్కలు రాయడంలో మీరే నెంబర్ వన్
దొంగలకు దొంగవి, దొంగ లెక్కలు రాయడంలో ఆల్ ఇండియాలోనే నెంబర్ 1 తమరే కదా అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ట్యాగ్ చేస్తూ బుద్దా వ్యాఖ్యానించారు. అందుకే నిన్ను, లక్ష కోట్ల దొంగనీ జైల్లో కూర్చో పెట్టారుగా అంటూ ఎద్దేవా చేశారు. దొంగ పేపర్, ఛానల్ పెట్టి తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేసావ్ కదా, నీకంటే ట్రిక్కులు ప్లే చేసే వాళ్ళు దేశంలో ఎవరైనా ఉన్నారంటావా అని ప్రశ్నించారు.