ఆంధ్రప్రదేశ్‌

ఉద్రిక్తతల నివారణకే బాబు గృహ నిర్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 11: ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పల్నాడులో శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదన్న ఏకైక లక్ష్యంతోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును, నాయకులను గృహ నిర్బంధం చేయాల్సి వచ్చిందని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబును గృహ నిర్బంధం చేయడంపై ఆయన స్పందించారు. బుధవారం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నందుకు చంద్రబాబును అడ్డుకోలేదని వివరణ ఇచ్చారు. రాష్టవ్య్రాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటం వల్లనే ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇదిలావుండగా ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి చంద్రబాబును వెళ్లనీయకుండా ఆయన నివాసం గేటుకు కట్టిన తాళ్లను పోలీసులు తొలగించారు. బుధవారం ఉదయం 7గంటలకు ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపునివ్వగా రాత్రి 7.30 గంటలకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై చంద్రబాబు తరపున న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.