ఆంధ్రప్రదేశ్‌

పాత పీపీఏలను పునః సమీక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 11: ఇప్పటికే అమల్లో ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏలను) పునః సమీక్షించబోమని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అధిక ధరలకు ఒప్పందాలు చేసుకున్నారంటూ పీపీఏలను పునఃసమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, ఒక నిపుణుల కమిటీని నియమించింది. పీపీఏలను పునః సమీక్షించడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాయడం, కొన్ని పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సంస్థలు కోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈనేపథ్యంలో ఏమైనా అవకతవకలు జరిగితేతప్ప, ఇప్పటికే అమల్లో ఉన్న ఒప్పందాలను పునః సమీక్షించబోమని రాష్ట్రం స్పష్టం చేసింది. ఇంకా ఖరారు కాని ఒప్పందాలపైనే దృష్టి సారిస్తామని లేఖలో వివరించింది.
ఎక్కువ ధరకు కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షిస్తాం: బాలినేని
నిబంధనలకు విరుద్ధంగా, వాస్తవ ధరలకన్నా ఎక్కువ ధరలకు కుదుర్చుకున్న ఒప్పందాలను తప్పకుండా సమీక్షిస్తామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజాప్రయోజనాల విషయంలో ఒక మెట్టు ఎక్కడం తప్ప దిగడం ఉండదని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీపీఏల విషయంలో ప్రాతిపదిక ప్రజాప్రయోజనాలేనని స్పష్టం చేశారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలు 20వేల కోట్ల రూపాయల నష్టాలతో కుంగిపోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ రంగం బతికి బట్టకట్టాలంటే ప్రక్షాళన తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం హయాంలో అవినీతి, ఆశ్రీత పక్షపాతంతో ఒప్పందాలు చేసుకుని ఖజానాకు నష్టం కలిగించారని మంత్రి ఆరోపించారు.