ఆంధ్రప్రదేశ్‌

బాబు అప్పుల్లో ముంచితే... జగన్ వరదల్లో ముంచుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 11: గత ప్రభుత్వ హయంలో ఏపీని చంద్రబాబు అప్పుల్లో మంచితే, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్ ప్రజలను వరదల్లో ముంచుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. వరదలను సైతం అంచనా వేయలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం దారుణమని బుధవారం ట్విట్టర్ వేదికగా కన్నా ఆరోపించారు. ఏపీలో ఇటీవల గోదావరి, కృష్ణా నదికి వరదులు వచ్చి ఇబ్బందులు పడుతుంటే ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. వరద నిర్వహణ చేతకాకపోతే నిపుణుల సలహా తీసుకుని పని చేయాలే తప్ప ప్రజలను ఇక్కట్ల పాలు చేయడం సరికాదని హితవు పలికారు. ముంపు బాధితులను ఆదుకోవాలని, రోగాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ట్విట్టర్‌లో సీఎం జగన్‌ను ట్యాగ్ చేస్తూ కోరారు.