ఆంధ్రప్రదేశ్‌

‘ఇంధన సామర్థ్యం’లో ఏపీకి సంపూర్ణ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలును మరింత విస్తృత పర్చే దిశగా కీలక ముందడుగు పడింది. ఏపీలో కీలక రంగాల్లో ఇంధన పొదుపునకు సంబంధించిన పెట్టుబడులను అంచనా వేసేందుకు అధ్యయనం చేస్తామనీ ‘ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్‌ట్యూట్ (టీఈఆర్‌ఐ) ప్రకటించింది. ఇంధన సామర్థ్య కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయడం వల్ల రాష్ట్భ్రావృద్ధికి కూడా దోహదం చేస్తుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లాంటి క్రియాశీల రాష్ట్రాలకు మద్దతునిచ్చేందుకు టీఈఆర్‌ఐ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని సంస్థ డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ తెలిపారు. బీఈఈ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ నెల 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల వినియోగదారులకు అందుబాటులో ధరలో నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్న ఏపీ లాంటి రాష్ట్రాలకు అండగా నిలిచేందుకు టీఈఆర్‌ఐ అన్ని వేళలా ముందుంటుందని చెప్పారు. అందుబాటు ధరలో విద్యుత్ అందించాలంటే ఇంధన సామర్థ్యమే కీలకమని మాథుర్ తెలిపారు. రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ అందించిన సమాచారం మేరకు ఏపీ ప్రభుత్వం విద్యుత్ రాయితీల కింద రూ. 6 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఇందులో రైతులకు పగటి పూట 9 గంటలు ఉచితంగా విద్యుత్ అందించేందుకే రూ. 4500 కోట్లు
వెచ్చిస్తోందని చెప్పారు. వ్యవసాయ రంగం మొత్తం విద్యుత్ వినియోగం 11,593 మిలియన్ యూనిట్లని, ఇంధన పొదుపు కార్యక్రమాలను అమలు చేస్తే భారీ ఎత్తున 3,478 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని తెలిపారు. దీని వల్ల రాష్ట్ర ఖజానాపై భారం తగ్గడమేగాక రైతులకు మరింత నాణ్యమైన విద్యుత్‌ను అందించి ఉత్పాదకతను పెంచవచ్చని తెలిపారు. అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులు ఏపీలో ఈఈ కార్యక్రమాల అమలుపై అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపారని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తరపున సదస్సుకు హాజరైన ఏపీఎస్‌ఈసీఎం సీఈవో ఏ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.