ఆంధ్రప్రదేశ్‌

పరుగు పెట్టించిన ‘నాణ్యమైన బియ్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: జిల్లాలోని సీతంపేట మండలం బొంది గ్రామంలో నాణ్యమైన బియ్యంతో చేసిన అన్నాన్ని స్వయంగా తిన్నానని, తనకు నచ్చిందని పౌరసరఫరాల కమిషనర్ కోన శశిధర్ అన్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా నాణ్యమైన బియ్యం పంపిణీ చేపట్టిన ప్రభుత్వం పేదోళ్ళకు తినడానికి పనికిరాని బియ్యం పంపిణీ చేశారంటూ విపక్ష టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సీరియస్‌గా తీసుకోవడంతో అమరావతి నుంచి ఉన్నతాధికారులు శ్రీకాకుళానికి పరుగులు తీసారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన నాణ్యమైన బియ్యం పంపిణీని పరిశీలించడానికి మంగళవారం వచ్చిన కమిషనర్ సీతంపేట గిరిజన ప్రాంతంతోపాటు బూర్జమండలంలో పలు గ్రామాలను పరిశీలించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాణ్యమైన బియ్యం పంపిణీపై పలు వివరాలు వెల్లడించారు. నాణ్యమైన బియ్యం పంపిణీపై ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సీతంపేట గిరిజన ప్రాంతంలో వర్షాలు కురవడం తదితర కారణాల వల్ల రెండవ రోజున మిగిలిన బియ్యాన్ని పంపిణీ చేసి రెండు రోజుల్లో శతశాతం పంపిణీని జిల్లా యంత్రాంగం పూర్తి చేసిందన్నారు. గిరిజన ప్రాంతాల్లో కొండలపైన ఉన్న గ్రామాలను కూడా సందర్శించామని గిరిజన ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూసామని అన్నారు. సీతంపేట ఏజెన్సీలో రహదారి సౌకర్యం లేని మూడు గ్రామాలకు కూలీలతో పంపించామన్నారు. రవాణా సమయంలో 30 నుంచి 35 ప్యాకేజీ బ్యాగులు తడిసాయని, అటువంటి ప్యాకింగులు అందిన వారికి తక్షణం మార్పు చేశామన్నారు. బియ్యం నాణ్యతపై పలువురు చేసిన ఆరోపణలు వాస్తవం కాదని కమిషనర్ పేర్కొన్నారు. తినగలిగే బియ్యం
పంపిణీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. క్లస్టర్ల మేపింగు జిల్లా స్థాయిలోనే చేయడానికి అవకాశం కర్పించామన్నారు. పంపిణీ చేస్తున్న బస్తాలను తిరిగి తీసుకుని వాటిని రీసైక్లింగ్ చేయడానికి ఆలోచిస్తున్నామన్నారు. ఒక బస్తా ఒకసారి మాత్రమే ప్యాకింగ్‌కు వినియోగించగలమన్నారు. బియ్యాన్ని రీసైక్లింగ్ చేయరాదనే కేంద్ర ప్రభుత్వ నిబంధన ఉందన్నారు. వలంటీర్లు ఒక్క పైసా కూడా రవాణా ఛార్జీగా పెట్టాల్సిన అవసరం లేదని, ప్రతి క్లస్టరుకు రూ. 500 చొప్పున్న నిధులను మంజూరు చేస్తామని కమిషనర్ స్పష్టం చేసారు. జిల్లా యంత్రాంగం కలెక్టర్ నివాస్ నేతృత్వంలో మార్గదర్శకంగా పనిచేసిందని ప్రసశించారు. అన్ని జిల్లా అధిర యంత్రాంగం శ్రీకాకుళం వైపుచూస్తోందన్నారు. ప్రజలు బాగా సహకరించారని, వలంటీర్ల సేవలు బాగున్నాయన్నారు.
అక్టోబర్ 2 నుంచి 72 గంటల్లో రేషన్ కార్డు
అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు ఏర్పడతాయని, అప్పటి నుంచి 72 గంటల్లో రేషన్ కార్డు మంజూరుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కమిషనర్ చెప్పారు. రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే సమయంలోనే లబ్ధిదారుడికి అర్హత ఉందా లేదా అనేది స్క్రీన్‌పై చూపిస్తుందన్నారు. తెల్లరేషన్ కార్డులు వద్దని స్వయంగా ఎవరైనా వదులుకుంటే అందుకు స్వాగతిస్తున్నామన్నారు. కొత్త కార్డులకు దాదాపు 30 వేల వరకూ దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. పౌరసరఫరాల సంస్థ ఎండీ ఎ.సూర్యకుమారి, కలెక్టర్ నివాస్, జేసీ శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ భార్గవతేజ, డీఆర్వో బలివాడ దయానిధి తదితరులు ఉన్నారు.

చిత్రాలు.. సీతంపేట ప్రాంతంలో పంపిణీ చేసిన బియ్యాన్ని పరిశీలిస్తున్న పౌర సరఫరాల శాఖ కమిషనర్ శశిధర్..
*నాణ్యమైన బియ్యంతో వండిన అన్నం తింటున్న కమిషనర్, ఇతర అధికారులు