ఆంధ్రప్రదేశ్‌

శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : గుంటూరు జిల్లా పల్నాడులో అంతా ప్రశాంతంగా ఉందని, శాంతిభద్రతలకు రాజకీయ పార్టీల నేతలు విఘాతం కల్గించవద్దని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తిచేశారు. ఇప్పటికే పల్నాడులో 144 సెక్షన్ అమలులో ఉందని, తాజాగా 30 పోలీసు యాక్ట్ విధించామని పేర్కొన్నారు. మంగళవారం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టంచేశారు. శాంతిభద్రతల విషయంలో అన్నివర్గాలు, రాజకీయ పార్టీల నేతలు పోలీసులకు సహకరించాలని కోరారు. వినాయక నిమజ్జనం, మొహరం పండుగల నేపథ్యంలో ప్రజలు ఆనందకర పరిస్థితుల్లో ఉన్నారని, వారి ప్రశాంతతకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టంచేశారు. పల్నాడులో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు
పోలీసుశాఖ సిద్ధంగా ఉందని డీజీపీ తెలిపారు.
ఆత్మకూరులో ప్రశాంత వాతావరణం : గురజాల డిఎస్పీ
ఆత్మకూరులో ప్రశాంత వాతావరణం నెలకొందని గురజాల డిఎస్పీ శ్రీహరి ప్రకటించారు. గతంలో ఒకే కుటుంబానికి చెందిన ఎస్సీల మధ్య గొడవలు జరిగాయని, అవన్నీ కుటుంబ వివాదాలేనని తెలిపారు. వాటితో రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. పోలీసుల చొరవతో వారంతా కలిసిపోయారని, ప్రస్తుతం గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొందని డిఎస్పీ పేర్కొన్నారు.