ఆంధ్రప్రదేశ్‌

అక్రమ ‘తులా’భారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 25: తూర్పు గోదావరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఓ అధికారి వ్యవహారం ఇప్పుడు దేవదాయ శాఖలో దుమారం రేపుతోంది. దశాబ్దాల క్రితం రాజకీయ ప్రాబల్యం, అధికార్ల అండదండలతో ఆలయంలో గుమాస్తా కేడర్‌లో అక్రమంగా నియమితుడైన ఒక వ్యక్తి అవే అండదండలతో ఎకాఎకిన అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి ఎదిగిన తీరు దేవదాయ శాఖలోని డొల్లతనాన్ని వెల్లడిచేస్తోంది. ముఖ్యమంత్రికి అందిన ఫిర్యాదుపై ప్రస్తుతం దర్యాప్తు జరిపిన దేవదాయ శాఖ ఉన్నతాధికారి సదరు వ్యవహారంలో తవ్వేకొద్దీ వెలుగుచూసిన నిజాలను చూసి విస్తుపోయినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే... దేవస్థానంలో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పీఆర్వోగా కొనసాగుతున్న తులా రాముడు వ్యవహారం చాలాకాలంగా వివాదాస్పదంగా మారింది. అధికార పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యుడు నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లడంతో అధికార యంత్రాంగం స్పందించింది. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలతో ఆ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) వేండ్ర త్రినాథరావు ఈనెల 10వ తేదీన అన్నవరం వచ్చి సమగ్ర దర్యాప్తు జరిపారు. ఈసందర్భంగానే సదరు పీఆర్వో వ్యవహారాన్ని లోతుగా పరిశీలించినపుడు అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. 1995లో పబ్లిక్ రిలేషన్స్ క్లర్కు (జూనియర్ అసిస్టెంట్ కేడర్)గా అన్నవరం ఆలయంలో తులా రాముడు నియమితులయ్యారు. ఈ నియామకం తీరు సైతం వివాదాస్పదమే. రాజకీయ వత్తిళ్ల మేరకు రాముడును అప్పటి కార్యనిర్వహణాధికారి పబ్లిక్ రిలేషన్స్ క్లర్కుగా (జూనియర్ అసిస్టెంట్ కేడర్) నియమించారు. నిజానికి దేవస్థానం కేడర్ స్ట్రెంగ్త్‌తో పబ్లిక్ రిలేషన్స్ క్లర్క్ పోస్టు లేనేలేదు. 11 సంవత్సరాలు సర్వీసు గడిచిపోయాక తులా రాముడి నియామకాన్ని ర్యాటిఫై చేస్తూ, ఆ నియామకాన్ని జూనియర్ అసిస్టెంట్‌గా గుర్తిస్తూ 2006లో ఉత్తర్వులిచ్చారు. నిబందనలకు విరుద్ధంగా 2007లో పీఆర్వోగా నేరుగా పదోన్నతి పొందారు. ఫిర్యాదుల నేపథ్యంలో నాలుగు నెలల తర్వాత పదోన్నతి రద్దుచేసి, జూనియర్ అసిస్టెంట్‌గా రివర్షన్ ఇచ్చారు. అయితే దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ఉపశమనం పొందారు. పదోన్నతికి సంబంధించి రావలసిన జీతం ఎరియర్స్ సైతం భారీగా అందుకున్నారు. తదనంతరం ఎనిమిది నెలల కాలంలోనే దేవస్థానం కార్యనిర్వహణాధికారిని, ఛైర్మన్‌ను దుర్భాషలాడి గదిలో నిర్భంధించారనే ఆరోపణలపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆయనను సర్వీసు నుంచి తొలగించాలని నిర్ణయించారు. దీనిపై మళ్ళీ రాముడు న్యాయస్థానాన్ని ఆశ్రయించి పీఆర్వోగా కొనసాగుతున్నారు. అయితే న్యాయ స్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రద్దుచేయించడానికి దేవస్థానం అధికారులు ప్రయత్నించపోవడం విమర్శలకు తావిచ్చింది. ప్రస్తుతం తులా రాముడు వ్యవహారంపై ఆర్జేసీ సమర్పించిన నివేదికపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.