ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ హయాంలోనే అన్యమత ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : తిరుమల ఆర్టీసీ బస్ టిక్కెట్లపై అన్యమత ప్రచారం కలకలం రేపటంపై ఎట్టకేలకు ప్రాథమిక విచారణ ముగిసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మైనార్టీ శాఖ క్రైస్తవులు, ముస్లింల కోసం ఉద్దేశించిన జెరూసలెం, హజ్ యాత్రలు, దుల్హన్, తదితర పథకాలపై ప్రచారం కోసం ఆర్టీసీ వాణిజ్య విభాగం అధికారులు ముందూవెనుక ఆలోచించకుండా కేవలం రాబడి కోసం టిక్కెట్లపై వాటిని ముద్రించారు. వాస్తవానికి గడచిన మూడేళ్లలో ఈ విభాగం వాణిజ్యపరమైన ప్రకటనలు తీసుకొచ్చిన దాఖలాలు కూడా లేవు. ఏడాది క్రితం బీసీ సంక్షేమ శాఖ నుంచి ‘ఆదరణ’ ప్రకటన తీసుకొచ్చారు. ఈ దఫా నెల్లూరు, కడప జోన్లలో ఆరు జిల్లాల్లోని డిపోలకు సంబంధించిన టిమ్ టిక్కెట్లపై ముద్రణకు మైనార్టీ సంక్షేమ శాఖ ఆర్డర్ జారీ చేసింది. దీని ప్రకారం పర్‌ఫెక్ట్ కోటెడ్ పేపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాంట్రాక్ట్ పొంది మొత్తం 29,800 టిమ్స్ టిక్కెట్ రోల్స్‌ను మార్చి 11న నెల్లూరు జోనల్ స్టోర్స్
కంట్రోలర్ ఎం జగదీష్‌బాబుకు అప్పగించారు. అయితే ఒకరోజు ఆర్టీసీ యాజమాన్యం తక్షణం టిక్కెట్ల వెనుక ప్రభుత్వ పథకాల ప్రచారం ఉన్నందున ఆ రోల్స్‌ను నిలిపి వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడి కోడ్ తొలగిన వెంటనే డిపోల వారీగా ఆ టిక్కెట్ రోల్స్ వెళ్లాయి. దీనిలోభాగంగా తిరుమల కొండపై ఉన్న ‘రామ్‌బగీచ’ డిపోకు వెయ్యి రోల్స్ వెళ్లాయి. అయితే తిరుమలపై ఈ టిక్కెట్ల వల్ల ఇంతటి యాగీ జరుగుతుందని ఆర్టీసీలో ఏ స్థాయిలోనూ ఎవరూ ఊహించలేదు. వాస్తవానికి మైనార్టీల ఓట్ల కోసమే ప్రభుత్వం అదీ ఎన్నికల కోడ్ వచ్చేముందు రోజు ముద్రంపజేసినట్లు తెలిసింది. తిరుమల కొండ ఆర్టీసీ టిక్కెట్లపై అన్యమత ప్రచారం జరుగుతుండటం, భక్తులు ఆందోళన చెందటంపై తొలుత ఈ నెల 23న ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ దినపత్రికల్లో ప్రముఖంగా వార్తాకథనం వెలువడింది. దీనిపై సంస్థ ఎండీ ఎన్వీ సురేంద్రబాబు, మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, పేర్ని వెంకట్రామయ్య తక్షణం స్పందించారు. ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవీఆర్కే ప్రసాద్‌ను విచారణాధికారిగా నియమించారు. టిక్కెట్ల ముద్రణ, పంపిణీ సంస్థపరంగా యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ కనీసం తిరుమల డిపోల వరకు ఆపి ఉండాల్సిందని విచారణాధికారి అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా స్టోర్స్ కంట్రోలర్ జగదీష్ బాబును సస్పెండ్ చేస్తూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) ఏ కోటేశ్వరరావు ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.