ఆంధ్రప్రదేశ్‌

పవర్ బులెటిన్ ఫలప్రదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్ర ప్రజలకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇంధన, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా రోజువారీ విద్యుత్ సరఫరా పరిస్థితి, అంతరాయాలు, అనుకోని అవాంతరాలు వంటి అంశాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితిని వివరిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఇంధన బులెటిన్’ను వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఆదివారం ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి బాలినేని మాట్లాడుతూ అందరికీ అందుబాటు ధరల్లో 24గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. థర్మల్, జల, పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి విద్యుత్‌ను సమకూర్చుకోవాలని, అదే సమయంలో ఖర్చు తగ్గించుకోవాలనేదే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. ‘ఇంధన బులెటిన్’ వల్ల రోజువారీ విద్యుత్ సరఫరా పరిస్థితిపై పారదర్శక సమాచారం అందుతుందన్నారు. ఇది ప్రజల చేతుల్లో ‘పవర్‌ఫుల్ బులెట్’గా మారుతుందన్నారు. వ్యవసాయానికి 9గంటలు పగటిపూట ఉచిత విద్యుత్ అందించటంలో ప్రభుత్వం సఫలీకృతం అవుతోందని మంత్రి తెలిపారు. అలాగే గృహ, ఇతర రంగాల వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించే విషయంలోనూ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉందని చెప్పారు. ఈ అంశాలన్నింటి వల్ల విద్యుత్ సంస్థలపై కొంతమేర ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని, అయినా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిర్దేశించారు. ఈ విషయంలో ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అక్కడక్కడా సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ సరఫరాలో అవాంతరాలు వస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చిందని, క్రమంగా ఈ ఫిర్యాదులను అత్యంత స్వల్ప సంఖ్యకు చేర్చాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అంతిమంగా అవాంతరాలు లేని విద్యుత్ సరఫరా లక్ష్యం కావాలని నిర్దేశించారు.
జూలైలో ప్రారంభించిన ఇంధన బులెటిన్ సత్ఫలితాలు ఇస్తోందని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు ఇంధన బులెటిన్‌లో ఐదు అంశాల సూత్రాలను అమలు చేయాలని సూచించారు. పూర్తి పారదర్శకత, అన్ని స్థాయిల్లో జవాబుదారీతనం పెంచడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను అభివృద్ధి చేయడం, ప్రజాసమస్యల పరిష్కారానికి సత్వరమే స్పందించటం వంటి చర్యలతో ఇంధన బులెటిన్
మరింత ఫలప్రదం అవుతుందన్నారు. దీనివల్ల అన్ని వర్గాల వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇంధన బులెటిన్ రాష్ట్భ్రావృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విద్యుత్ సరఫరాలో తప్పనిసరి పరిస్థితుల్లో అవాంతరాలు ఏర్పడితే అందుకు కారణాలను గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలందరికీ ఇంధన బులెటిన్ ద్వారా తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి పూర్తి పారదర్శకతతో ఇంధన బులెటిన్ విడుదల చేస్తున్నామని, ఎప్పటికప్పుడు డిస్కంల సీఎండీల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు అందజేయాలని ఎస్‌ఈలు, డిస్కంల అధికారులు, ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీలకు సూచించారు. రానున్న కాలంలో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంల అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 160 మిలియన్ యూనిట్లుగా ఉన్న డిమాండ్ సెప్టెంబర్‌లో 185 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తున్నందున ఆగస్టు తొలి వారంలో డిమాండ్ 148 మిలియన్ యూనిట్లకు తగ్గిందని చెప్పారు. తమకున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్‌లో డిమాండ్ 185 నుంచి 190 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అంతరాయాల్లేని విద్యుత్ సరఫరాలో డిస్కంలు ఇప్పటికే విజయవంతం అయ్యాయని చెప్పారు. ప్రస్తుతం అత్యల్ప అంతరాయాలతో విద్యుత్ సరఫరా చేస్తున్నాయన్నారు. ఈ నెల 24న ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో అంతరాయాల శాతం 0.48 శాతం కాగా ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 8 జిల్లాల్లో ఇది 0.221 శాతంగా నమోదైందని తెలిపారు. లైన్ల మరమ్మతుల సమయంలో కరెంట్ సరఫరా నిలిపివేయాల్సివస్తే ముందుగానే ప్రజలకు సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు. చౌకగా విద్యుదుత్పత్తి చేయాలనే ప్రభుత్వ విధానంలో భాగంగా ఈ నెలలో రోజుకు సగటున 82మిలియన్ యూనిట్లు చొప్పున ఏపీ జెన్‌కో 23రోజుల పాటు విద్యుదుత్పత్తి జరిపిందని జెన్‌కో సీఎండీ బీ శ్రీ్ధర్ తెలిపారు. గతేడాది ఇదే సమయంలో రోజుకు 68మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి జరిగిందన్నారు. ఈ నెలలో థర్మల్ విద్యుదుత్పత్తి సగటున రోజుకు 62మిలియన్ యూనిట్లు కాగా, గతేడాది ఇదే సమయంలో 49మిలియన్ యూనిట్లు మాత్రమే ఉందని ఆయన వివరించారు. టెలీకాన్ఫరెన్స్‌లో ట్రాన్స్‌కో జేఎండీలు కేవీఎన్ చక్రధర్‌బాబు, పి ఉమాపతి, డిస్కంల సీఎండీలు నాగలక్ష్మి సెల్వరాజన్, హెచ్ హరనాథరావు, డైరెక్టర్ కె రాజబాపయ్య, వెంకటేశులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చిత్రం... ఇంధన, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి