ఆంధ్రప్రదేశ్‌

‘సర్దుబాటు’ బాదుడు 15వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : రాష్ట్రంలో అధికార మార్పిడి జరగ్గానే విద్యుత్ పంపిణీ సంస్థలకు విద్యుత్ కొనుగోళ్లలో వచ్చిన నష్టాలు ముందుకొచ్చాయి. సర్దుబాటు చార్జీల పేరుతో వినియోగదారులను బాదేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. 15వేల కోట్ల రూపాయల మేర సర్దుబాటు చార్జీలను వసూలు చేసేందుకు అనుమతించాలంటూ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. మరోవైపు మిగులు విద్యుత్ ఉన్నా కొనుగోళ్లు చేయగా, సర్దుబాబు చార్జీల మదింపులో శాస్ర్తియత లోపించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2015-16 సంవత్సరం నుంచి నాలుగేళ్లకు సంబంధించి చార్జీల వివరాలను ఈఆర్సీకి పంపారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ చార్జీలు పెంచకపోగా, భవిష్యత్తులో పెంచబోమని గొప్పగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటనల్లోని డొల్లతనం ఇప్పుడు బయటికొస్తోంది. విద్యుత్ చార్జీల పెంపు రూపంలో ఇది వినియోగదారులపై భారం మోపబోతోంది. 2015-16, 2016-17 సంవత్సరాలకు సంబంధించి 11వేల కోట్ల రూపాయల మేర నష్టం వచ్చినట్లు ఈఆర్సీకి పంపిన ప్రతిపాదనల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే నష్టాలు ఏవిధంగా వచ్చాయన్న వివరాలు మాత్రం సక్రమంగా ఈఆర్సీకి పంపకపోవడం గమనార్హం. 2016-17 సంవత్సరంలో ఈఆర్సీ అనుమతించిన పరిమితికి కన్నా 4244 మిలియన్ యూనిట్ల మేర తక్కువగా
విద్యుత్ కొనుగోలు చేయగా, 2017-18 సంవత్సరంలో 822 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్‌ను తక్కువగా కొనుగోలు చేశారు. ఈ రెండు సంవత్సరాల్లో ఈఆర్సీ అనుమతించిన దానికన్నా 5493 కోట్ల రూపాయల మేర అదనంగా ఖర్చు చేశారు. ఈఆర్సీ అనుమతించిన దానికన్నా 5066 మిలియన్ యూనిట్ల మేర తక్కువ విద్యుత్ కొనుగోలు చేసినా, ఖర్చు మాత్రం 5 వేల కోట్ల రూపాయల మేర అదనంగా జరగడం గమనార్హం. 2016-17 సంవత్సరంలో ఫిక్స్‌డ్ కాస్ట్ కింద 270 కోట్ల రూపాయలు, వేరియబుల్ కాస్ట్ కింద 3086 కోట్ల రూపాయలు చెల్లించారు. దాదాపు 100 కోట్ల రూపాయలను ఎందుకు ఖర్చుచేశారో కూడా చెప్పకుండా ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపడం గమనార్హం. ఒక సందర్భంలో రాష్ట్రంలో 10,384 మిలియన్ యూనిట్ల మేర మిగులు విద్యుత్ ఉండగా, 1707 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్‌ను కొనుగోలు చేశారు. తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ తీసుకోకపోవడం వల్ల కూడా దాదాపు 1000 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. విద్యుత్ కొనుగోళ్లు, ఫిక్స్‌డ్ చార్జీలు, వేరియబుల్ కాస్ట్ నిర్ణయం, తదితర అంశాల్లో ఈఆర్సీ అనుమతిని చాలా సందర్భాల్లో పొందకపోవడం గమనార్హం. కొన్ని సందర్భాల్లో అనుమతించిన దానికన్నా ఎక్కువ చెల్లింపులు చేయడం వంటివి చోటుచేసుకున్నాయి. సర్దుబాబు చార్జీలను శాస్ర్తియంగా మదింపు చేసి, ఆ నిర్ణయం తీసుకునేందుకు దారితీసిన కారణాలతో వివరంగా ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపాల్సి ఉండగా, అందుకు భిన్నంగా చాలావాటికి ఎందుకు ఖర్చు చేశారన్న కారణాలు, తదితర అంశాలను స్పష్టంగా వివరించలేదు. విద్యుత్ పంపిణీ సంస్థలు (తూర్పు, దక్షిణ) రూపొందించిన సర్దుబాటు చార్జీల ప్రతిపాదనను యథాతథంగా ప్రభుత్వం కూడా ఈఆర్సీకి పంపడం గమనార్హం. నాలుగేళ్లకు సంబంధించి ప్రతిపాదనలను ఒకేసారి చేయటం కూడా విమర్శలకు గురవుతోంది. ఈఆర్సీ ఆమోదిస్తే ఆ మేరకు వినియోగదారులపై భారం పడనుంది. ప్రస్తుతం బాల్ ఈఆర్సీ కోర్టులో ఉంది.