ఆంధ్రప్రదేశ్‌

నేడు ఢిల్లీకి సీఎం జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 25: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం, ప్రభావం అంశాలపై సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర హోం శాఖ నిర్వహించే కీలక సమావేశానికి ఆయన హాజరవుతున్నారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మావోయిస్టుల అణచివేతకు రాష్ట్రాల సహకారంతో ఉమ్మడి కార్యాచరణ చేపట్టేందుకు కేంద్రం వ్యూహరచన చేస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర - ఒడిశా సరిహద్దు ప్రాంతం (ఏఓబీ)తో పాటు ఇతర
ప్రాంతాల్లో నక్సల్స్ ప్రభావం ఉంది. కొద్దిరోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం నక్సల్స్‌పై నిషేధాన్ని మరో ఏడాది కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్తిస్థాయిలో నక్సలిజం అణచివేతకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్‌హంట్, సమాధాన్ వంటి కార్యాచరణలను ఇప్పటికే చేపట్టింది. గ్రీన్‌హంట్‌లో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ముఖ్య నేతల్ని మావోయిస్టు పార్టీ కోల్పోయింది. ఆంధ్ర ప్రాంతంలోని నల్లమల అటవీ ప్రాంతం కొంతకాలంగా పోలీసుల అధీనంలో ఉంది. దీంతో ఏఓబీనే మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పోలీసులు భావిస్తున్నారు. దండకారణ్యం విస్తరించిన రాష్ట్రాలపై ప్రధానంగా కేంద్రం గురిపెట్టింది. మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకత్వ బాధ్యతల నుంచి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతిని తప్పించి శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాళ్ల కేశవరావుకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఈనేపథ్యంలో ఆంధ్ర - ఒడిశా ప్రాంతంలో నక్సలిజం సమస్యను పరిష్కరించే దిశగా ఢిల్లీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్ సోమవారం ఉదయం 7.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. సమావేశం అనంతరం విభజన అంశాలకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.