ఆంధ్రప్రదేశ్‌

టీఆర్‌ఎస్ నాకెన్నోసార్లు గాలం వేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 24: తమ పార్టీలోకి చేర్చుకోవడానికి టిఆర్‌ఎస్ నేతలు తనకు ఎన్నో ప్రలోభాలు చూపారని, సాక్షాత్తు ముఖ్యమంత్రి చేతకూడా ప్రయత్నాలు చేశారని, అయినా తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వర రావు అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ఆయన కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమలకు చేరుకుని శనివారం ఉదయం విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తానేనని అన్నారు. తనను టీఆర్‌ఎస్‌లో చేర్పించడానికి ఆపార్టీ నేతలు ఎన్నో ప్రలోభాలు పెట్టారని ఆరోపించారు. గత ఎన్నికల్లో తన నియోజక వర్గ ప్రజలు సైకిల్ గుర్తును, నన్ను చూసి గెలిపించారన్నారు. తాను ఎన్‌టిఆర్, చంద్రబాబు నాయుడు అభిమానని తనను ప్రజలు గెలిపించారని ఈక్రమంలో పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించానని ఆయన అన్నారు.