ఆంధ్రప్రదేశ్‌

ఫోక్స్ వ్యాగన్ కేసులో ఎలాంటి నోటీసులు అందలేదు: బొత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 24: ఫోక్స్ వ్యాగన్ కేసులో తనకు సీబీఐ కోర్టు నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని, మీడియాలోనే వార్తలను చూస్తున్నానని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో శనివారం విమ్స్ ఆసుపత్రిలో పర్యటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నెల రోజులుగా సీబీఐ అధికారులు తనను సంప్రదిస్తున్నారని, నోటీసులు అందితే కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెబుతానన్నారు. ఆ కేసులో నిందితులకు శిక్ష వేయ్యాలా వద్దా అనేది కోర్టు నిర్ణయం తీసుకుంటుందన్నారు. అమరావతి రాజధానిని మారుస్తున్నారని తాను ఎక్కడా అనలేదని, శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కన పెట్టి అప్పటి మంత్రి నారాయణ కమిటీ నివేదిక ప్రకారం అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారన్నారు. అమరావతిలో నిర్మాణ వ్యయం పెరుగుతుందని చెప్పానే తప్ప.. రాజధానిని మారుస్తున్నారని చెప్పలేదన్నారు. గతంలో ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీరు వస్తేనే అమరావతి ప్రాంతం మునిగిపోయిందని, పదేళ్ల క్రితం వచ్చినట్లు వరదలు వస్తే ఏం చేస్తారని బొత్స ప్రశ్నించారు.