ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో వేడుకగా ఉట్లోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 24: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా తిరుమలలో శనివారం ఉట్లోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. శ్రీవేంకటేశ్వస్వామివారికి గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరునాడు ఉట్లోత్సవాన్ని(శిక్యోత్సవం) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శ్రీమలయప్పస్వామి వారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామి మరో తిరుచ్చిపై తిరువీధుల్లో ఊరేగుతూ పలు ప్రాంతాల్లో ఉట్లోత్సవాన్ని తిలకించారు. ముందుగా శ్రీమలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులు ఊరేగింపుగా శ్రీపెద్దజీయర్ మఠానికి వేంచేపు చేశారు. అక్కడ ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత శ్రీవారి ఆలయం ఎదుట ఉట్లోత్సవం ఉత్సాహంగా జరిగింది. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉట్లను కొట్టారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, సివిఎస్‌ఓ గోపీనాథ్‌జెట్టి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, విఎస్‌ఓ మనోహర్, పేష్కార్ లోకనాథం పాల్గొన్నారు.
చిత్రం... తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఉట్టి కొడుతున్న యువకులు