ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల టౌన్, ఆగస్టు 24: రాష్ట్రాన్ని పిచ్చివాడి చేతిలో పెట్టడంతో ప్రజలు భూలోకంలో యమలోకం చూస్తున్నట్టుగా భావిస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నేత చింతల మోహన్‌రావు స్వగృహంలో శనివారం తులసిరెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తే వారి ఆశలు అడియాశలయ్యాయన్నారు. అన్ని రంగాల్లో వైసీపీ విఫలమైందని, పిచ్చి తుగ్లక్ పాలనను తలపించేలా నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయకపోగా వారిని తీసివేసే పనిలో ఉన్నాడని విమర్శించారు. ఇప్పటికే 6 నెలల నుంచి జీతాలు అందక వారి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకాయిలు దాదాపు రూ. 2,390 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ బకాయిలను వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ఒకవేళ ప్రభుత్వం దివాళా తీసి ఉంటే చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టును వైఎస్‌ఆర్ హయాంలోనే అమలు చేశారని, అయితే కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా చేపడితే ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉందని కేంద్రానికి అప్పజెప్పారన్నారు. నేడు జగన్ ప్రభుత్వం పోలవరం టెండర్లను రద్దు చేసి మరొకరికి ఇవ్వడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇప్పటికే 70 శాతానికి పైగా పోలవరం ప్రాజెక్టు పూర్తయిందని, మిగతా 30 శాతం పూర్తయితే మన దేశం సస్యశ్యామలం అవుతుందన్నారు. నవరత్నాలులో రైతు భరోసాలో భాగంగా ప్రభుత్వం రైతులకు రూ. 12,500 ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం రూ. 6,500 మాత్రమే ఇవ్వడం చూస్తుంటే పాలన ఎంతవరకూ సజావుగో ఉందో తెలుస్తోందన్నారు. ఒకవైపు మద్యపాన నిషేధం అంటూ మరోవైపు ఎక్సైజ్ సుంకం పెంచడం చూస్తుంటే రాష్ట్రాన్ని ఎడారిగా మారుస్తున్నట్లు అనిపిస్తోందన్నారు.