ఆంధ్రప్రదేశ్‌

ప్రముఖ రచయిత్రి జగద్దాత్రి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (కల్చరల్), ఆగస్టు 24: విశాఖకు చెందిన ప్రముఖ రచయిత్రి జగద్దాత్రి శుక్రవారం రాత్రి మృతి చెందారు. మానసికంగా తీవ్ర ఒత్తిడితో ఉన్న ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. అనువాదకురాలిగా ఆమెకు మంచి పేరుంది. ఉత్తరాంధ్రతోపాటు, ఒడిశాలో కూడా ఆమె అనేక సాహితీ సదస్సులు నిర్వహించారు. ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడెమీ సభ్యురాలిగా కొనసాగుతున్న జగధాత్రి మరో ప్రఖ్యాత రచయిత దివంగత రామతీర్థతో కలిసి జీవించేవారు. అయితే కొద్ది రోజుల కిందట రామతీర్థ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అప్పటి నుంచి జగధాత్రి తీవ్ర మనస్తాపం చెందారు. కొద్ది రోజులుగా తీవ్ర మనస్తాపంతో జీవిస్తున్న జగధాత్రి శుక్రవారం రాత్రి తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. తన ఆత్మహత్యకు ఎవరూ కారకులు కాదని, తనకు చెందిన వస్తువులు, ఆస్తిపాస్తులు రాజేష్ అనే వ్యక్తికి అందజేయాలని ఆమె తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నారు.