ఆంధ్రప్రదేశ్‌

వరదంతా వదిలేస్తే రాయలసీమకు నీళ్లెలా ఇస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణానదికి వరద వచ్చిన సమయంలో రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా 46 టీఎంసీలు ఇచ్చామని, ఈ నెలాఖరుకు 60 టీఎంసీలు ఇస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. శనివారం నగరంలోని జలవనరుల శాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరద జలాల నిర్వహణపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విమర్శలను ఖండించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిన నీటిని ఎప్పటికప్పుడు నాగార్జునసాగర్‌కు విడుదల చేసి ఉంటే రాయలసీమకు నీరిచ్చే పరిస్థితి ఉండేదా? అని మంత్రి ప్రశ్నించారు. శ్రీశైలంలో నీటిమట్టం 881 అడుగులు లేకుండా పోతిరెడ్డిపాడు నుండి 44,500 క్కూసెక్కులు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఇన్‌ఫ్లో ఒక్కసారిగా తగ్గిపోయిందని, మాజీ ముఖ్యమంత్రి చెప్పినట్లు నీరు ముందుగానే వదిలేసి ఉంటే ఇప్పుడు ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉండేవన్నారు. పోతిరెడ్డిపాడు నుండి తొలిసారి 44,500 క్యూసెక్కులు విడుదల చేసి రికార్డు సృష్టించామన్నారు. కేవలం 6గంటలు మాత్రమే వరద ప్రవాహం 8లక్షల క్యూసెక్కులు వచ్చిందని, రెండ్రోజులు 7లక్షల క్యూసెక్కుల చొప్పున వదలగా, మిగిలిన రోజుల్లో 6లక్షల క్యూసెక్కులకన్నా తక్కువగానే వదిలామని వివరించారు. చంద్రబాబు చెప్పినట్లు చేస్తే వరద 10లక్షల క్యూసెక్కులు దాటేదన్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యాన్ని వినియోగించుకుని తొలిసారిగా 45 టీఎంసీలు నిల్వ చేశామని తెలిపారు. అయినా నదీగర్భంలో ఇల్లు కట్టుకున్నప్పుడు వరద వస్తే మునగకుండా ఎలా ఉంటుందని మంత్రి ప్రశ్నించారు. వరద ఎక్కువగా వస్తుందని ఆయనకు అవగాహన ఉండబట్టే రెండ్రోజుల ముందే సామాన్లన్నీ మొదటి అంతస్తులోకి సర్దుకుని, ముందుజాగ్రత్తగా హైదరాబాద్ వెళ్లిపోయారన్నారు. పోలవరం ప్రాజెక్టుపై విలేఖరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. హైడల్ ప్రాజెక్టుకు సంబంధించిన మొబిలైజేషన్ అడ్వాన్సును తిరిగి ఇవ్వాల్సి వస్తుందని నవయుగ సంస్థ కోర్టుకు వెళ్లిందని మంత్రి చెప్పారు. కేంద్రం నిధులిస్తున్నా ప్రాజెక్టును సరిగ్గా నిర్మించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు, కర్నూలు సీఈ సీ నారాయణరెడ్డి, పులచింతల ఎస్‌ఈ జే రమేష్‌బాబు పాల్గొన్నారు.
చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అనిల్‌కుమార్ యాదవ్