ఆంధ్రప్రదేశ్‌

కోడెల ఆరోగ్య పరిస్థితిపై బాబు ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ): తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరోగ్య పరిస్థితిపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తీవ్రమైన గుండెనొప్పి రావడంతో శుక్రవారం రాత్రి కోడెల గుంటూరులోని శ్రీ లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కోడెల అల్లుడు డాక్టర్ మనోహర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం వైద్యసేవలు అందిస్తున్నారు. శనివారం చంద్రబాబు డాక్టర్ మనోహర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం వల్లనే ఆయనకు గుండెపోటు వచ్చిందని డా. మనోహర్ బాబుకు తెలిపారు. గతంలో ఒకసారి కోడెలకు గుండెపోటు రావడంతో అప్పుడు స్టంట్ వేశామన్నారు. ప్రస్తుతం ఆయన శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. 23గంటలు గడిచిన తరువాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటే యాంజియోగ్రామ్ చేయడానికి ప్రయత్నిస్తామని వివరించారు. కోడెలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని, అవసరమైతే హైదరాబాద్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలని చంద్రబాబు సూచించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న కోడెల ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం వర్గాలు, ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు, నరసరావుపేట, సత్తెనపల్లికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు హాస్పిటల్‌కు వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.