ఆంధ్రప్రదేశ్‌

అన్యమత ప్రచారాన్ని సహించబోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఆగస్టు 23: పవిత్రమైన పుణ్యక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వంచే నడుపబడుతున్న ఆర్టీసీలో టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం చేయడాన్ని సహించబోమని, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో 370, 35 ఆర్టికల్ రద్దుపై తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలోని ఆడిటోరియంలో విద్యార్థులతో జరిగే కార్యక్రమంలో పాల్గొనడాకి శుక్రవారం రాత్రి విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బీజేపీ నాయకులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశ ప్రజలకు ఏకైక ఆశాజ్యోతి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని, దేశ రాష్ట్ర భవిష్యత్ కోరేవారు మోదీ నాయకత్వంలో బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది సీనియర్ నాయకులే కాకుండా ప్రముఖులు కూడా బీజేపీలో చేరుతున్నారన్నారు. ఈ మధ్య కాలంలో రాయలసీమ నుండి అనేక మంది నాయకులు బీజేపీలో చేరారన్నారు. అభివృద్ధిని కాంక్షించేవారు ఏపార్టీకి చెందినవారైనా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానన్నారు. దేశ భవిష్యత్ కోసం తమతో కలిసి పనిచేయడానికి ప్రముఖ నేతలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు బీజేపీ అండగా ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.