ఆంధ్రప్రదేశ్‌

ఇండో-జర్మన్ టెక్నాలజీతో నివాస భవనాలకు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 23: ఇండో-జర్మన్ టెక్నాలజీతో నివాస భవనాల్లో ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుందని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ తెలిపారు. ఇంధన శాఖ అధికారులతో శుక్రవారం ఆయన నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ ఇండో- జర్మన్ బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ టెక్నాలజీగా వ్యవహరించే ఈ టెక్నాలజీని అమలు చేసేందుకు ఏపీ సహా గుజరాత్, రాజస్థాన్‌లను కేంద్రం ఎంపిక చేసిందని తెలిపారు. ఈ టెక్నాలజీ వినియోగం వల్ల నివాస భవనాల్లోని ఉష్ణోగ్రత తగ్గుతుందని, ఇంధన వినియోగంలో కూడా పొదుపు సాధ్యమన్నారు. ఈ టెక్నాలజీకి ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్ (నివాస గృహాలు) అనుసంధానం చేస్తామన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుతున్న తరుణంలో ఈ టెక్నాలజీ వినియోగం వల్ల నివాస భవనాల్లో కూడా ఉష్ణోగ్రత తగ్గుతుందన్నారు. తక్కువ ఆదాయం కలిగిన వారి గృహాల్లో కూడా ఈ టెక్నాలజీని వినియోగించవచ్చన్నారు.
ఈ నేపథ్యంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సంస్థ రెండు రోజుల వర్కుషాపును నిర్వహించేందుకు నిర్ణయించిందన్నారు. బిల్డర్లకు, ఆర్కిటెక్ట్‌లకు, ఇంజనీర్లకు, ఇతర గృహ నిర్మాణంతో ఉన్న వారికి అవగాహన కల్పించేందుకు ఈ వర్కుషాపు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో విజయవాడలో నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో భారీ సంఖ్యలో గృహ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీ వల్ల ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు. ఈ టెక్నాలజీ వినియోగించి పైకప్పు, కిటీకీలు, గోడలను నిర్మిస్తామన్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే 8 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందన్నారు. పగటి వెలుతురు, గాలి ధారాళంగా వచ్చేలా డిజైను చేస్తారన్నారు. ఇంధనం 20 శాతం మేర ఆదా అవ్వడం వల్ల విద్యుత్ బిల్లు చాలా మేరకు తగ్గుతుందన్నారు. 500 చదరపు మీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు ఈ టెక్నాలజీ వినియోగించే అవకాశం ఉంటుందన్నారు. బీఈఈ అంచనాల ప్రకారం ఇంధన వినియోగం 1996-97లో 55 టెరా వాట్ అవర్స్ ఉండగా, 2016-17లో 260 టెరా వాట్ అవర్స్‌కు చేరిందన్నారు. 2032 నాటికి 940కి చేరే అవకాశం ఉందన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 30 శాతం మేర భవన నిర్మాణ రంగం వినియోగిస్తుండగా, అందులో 75శాతాన్ని గృహ వినియోగమని తెలిపారు. ఇంధన వినియోగంలో పొదుపు పాటించడం వల్ల 2030 నాటికి 125 బిలియన్ యూనిట్ల మేర విద్యుత్‌ను ఆదా చేయగలన్నారు. కొత్త బిల్డింగ్ కోడ్ అమలుకు వీలుగా మార్గదర్శకాలు రూపొందించాలని బీఈఈ రాష్ట్రాన్ని కోరుతోందన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో పేదలకు గృహ నిర్మాణం దీని వల్ల సాకారం అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎయిర్ కండిషన్ల వినియోగాన్ని కూడా తగ్గించేందుకు వీలు అవుతుందన్నారు.