ఆంధ్రప్రదేశ్‌

‘తప్పును కప్పిపుచ్చుకునేందుకే కోడెల దొంగతనం డ్రామా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 23: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు దొరికిపోయిన దొంగ అని స్పష్టమైందని, చేసిన దొంగతనాన్ని ఆయన అంగీకరిస్తే బాగుంటుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.
శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోడెల, ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవినీతి, తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చిన్న దొంగతనం డ్రామాను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఒక తప్పు నుండి తప్పించుకునందేకు కోడెల మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై కోడెల చేసిన ఆరోపణల గురించి విచారించగా ఆయన చెప్తున్న అర్జున్ అనే వ్యక్తి మున్సిపల్ ఔట్ సోర్సింగు ఉద్యోగిగా తేలిందన్నారు. మా వద్ద అతను పనిచేయడం లేదని, నిజానికి అర్జున్ అనే వ్యక్తిని తానెప్పుడూ కలవలేదని స్పష్టంచేశారు.