ఆంధ్రప్రదేశ్‌

ఎవరి మీద కోపంతోనో రాజధానిని మార్చొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 23: అత్త మీద కోపం దుత్త మీద చూపిన చందంగా ఎవరి మీద కోపంతోనో రాజధాని అమరావతిని నాశనం చేయాలని చూస్తే అది చరిత్రలో పెద్ద తప్పవుతుందని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తనకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజధానిని అమరావతి నుండి మార్చరు...కాకపోతే ఏదో ఉందన్నట్లుగా కేవలం నామమాత్ర రాజధానిగా ఉంచి, దాని అభివృద్ధిని నిర్వీర్యం చేయాలని, ముఖ్యమంత్రి జగన్ నివాసానికి దగ్గరగా కొన్ని భవనాలు కట్టి అమరావతిని ఇప్పుడున్న భవనాల వరకే పరిమితం చేయాలనే ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. ఈ విధంగా కొందరి సలహాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే అది దురదృష్టకరమన్నారు. రాజధానిని అభివృద్ధి చేస్తూనే ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు ఇతర ప్రాంతాలను కూడా పారిశ్రామికంగా ఇతరత్రా కూడా అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు. అమరావతిలో గత ప్రభుత్వం చేసిన అవినీతి ఏమైనా ఉంటే దాన్ని కచ్చితంగా నిగ్గుతీయాలన్నారు. సింగపూర్ ఒప్పందాన్ని కూడా తిరగతోడవచ్చునన్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో నికరంగా వచ్చిన రూ లక్ష కోట్లు పైబడిన సంపదను వాడుకోవాలన్నారు. అమరావతిని ఇంకా అభివృద్ధి చేస్తూ ఆ నిధుల్లో కొంత భాగాన్ని మిగిలిన ప్రాంతాల సర్వతో ముఖాభివృద్ధికి వాడాలన్నారు.
కేవలం చంద్రబాబుపై వ్యక్తిగత కోపంతో నిర్ణయాలు తీసుకుంటే అవి రాష్ట్రానికి శాపంగా మారతాయని హెచ్చరించారు. 50 అంతస్తుల ఐకానిక్ కట్టడాలు అవసరం లేకపోతే కేవలం అలాంటిది ఒకటి కట్టి మిగిలినవి మామూలుగానే కట్టుకోవచ్చన్నారు. అమరావతిలో తొమ్మిది నగరాలుగా అనుకున్న విభాగాలకు లబ్ధప్రతిష్టులు, జగన్‌కు ఇష్టమున్న నాయకుల పేర్లు పెట్టుకోవచ్చన్నారు. నాడు తాము కూడా రాజధాని రాజమండ్రి అయితే బాగుంటుందనుకున్నామన్నారు. అయితే రాయలసీమకు సమీపంలో కృష్ణానది దక్షిణాన ఉండాలన్న నిర్ణయం జరిగినప్పుడు జగన్ సహా అన్ని పార్టీల నేతలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించినప్పుడే అమరావతే రాజధానిగా అందరూ స్థిర నిర్ణయానికి వచ్చామన్నారు. ఇప్పుడు రివర్సులో రిఫరెండమ్ లేదా మరొకటి అంటూ జిల్లాలు, ఉప ప్రాంతాల మధ్య గొడవలు, విద్వేషాలు పెంచొద్దంటూ చలసాని కోరారు. అమరావతి ప్రాముఖ్యతను వరదలకు ముడిపెట్టి బురద జల్లవద్దన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, నా ఇల్లు రెగ్యులరైజ్ చేస్తే అమ్ముకుంటాననే విధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాడు ప్రభుత్వానికి పెట్టుకున్న అభ్యర్థననే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తిరస్కరించారన్న కోపం, రాజకీయ విభేదాలు మనసులో పెట్టుకోకుండా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని కోరారు. మొత్తం రాష్ట్రం, భావి తరాల అభివృద్ధి తొలి ప్రాతిపదిక కావాలన్నారు.