ఆంధ్రప్రదేశ్‌

బాబు హయాంలోనే హిందూమతానికి అసలైన అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 23: హిందూ మతానికి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవమానం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, దేవదాయశాఖ మంత్రిగా మాణిక్యాలరావు ఉన్న సమయంలో దుర్గ గుడి, శ్రీకాళహస్తిలో తాంత్రిక పూజలు జరిగాయని, విజయవాడలో 50 హిందూ దేవాలయాలను కూల్చివేశారని మండిపడ్డారు. శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో విష్ణు మాట్లాడుతూ కేవలం రాజకీయ భవిష్యత్తుపై భయంతోనే టీడీపీ, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్టీసీ బస్ టిక్కెట్లపై హజ్ యాత్ర గురించి ప్రచురించారని, ఇప్పటికీ అవే ఆర్టీసీలో కొనసాగుతున్నాయన్నారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ ట్రాప్‌లో పడుతున్నారన్నారు. ఆర్టీసీ బస్ టిక్కెట్ల వ్యవహారంపై ఇప్పటికే దేవాదాయశాఖ మంత్రి విచారణకు ఆదేశించారని, తప్పు చేసిన అధికారులపై చర్యలు తప్పవని మల్లాది స్పష్టంచేశారు.