ఆంధ్రప్రదేశ్‌

అన్యమత ప్రచారం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 23: తిరుపతి నుంచి బయలుదేరే ఆర్టీసీ బస్సుల టికెట్లపై అన్యమత గుర్తులతో ప్రచారానికి పాల్పడుతున్న వర్గాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుషికేష్‌లో చాతుర్మాస దీక్షలో ఉన్న స్వామీజీ తిరుపతిలో చోటుచేసుకున్న సంఘటనపై స్పందించారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న వ్యక్తులు, ఎవరి ప్రోద్బలంతో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్న విషయాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్ఠత ప్రపంచ విధితం. అటువంటి పుణ్యక్షేత్రంలో అన్యమత ప్రచారం జరిగితే హిందూ భక్తుల మనోభావాలలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. హిందువుల మనోభావాలకు ఏమాత్రం విఘాతమేర్పడకుండా అన్యమత ప్రచారకును కఠినంగా శిక్షించాలని హితవు పలికారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హిందూ దేవాలయాల చుట్టూ అన్యమత ప్రచారం చేయరాదని ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఈ ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్టు తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లామని స్పష్టం చేశారు.