ఆంధ్రప్రదేశ్‌

రెండు నెలల్లో భూ రికార్డుల ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో రెండు నెలల్లో భూ రికార్డుల ప్యూరిఫికేషన్ (ప్రక్షాళన) ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో తన చాంబర్ నుంచి 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల రీ-సర్వే, ఇళ్ల స్థలాలు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలన్నారు. ఇళ్ల స్థలాలు, భూముల సర్వే చేసే ముందు అన్ని విధాలుగా సిద్ధం కావాల్సి ఉందన్నారు. ప్రతి మండలంలో ఒక గ్రామంలో ప్రయోగాత్మకంగా సర్వే చేపట్టాలన్నారు. పని విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరణించిన పట్టాదారుల వారసులకు బదిలీకి సంబంధించి నమూనా-1 ద్వారా వివరాలు తీసుకోవాలన్నారు. ఈ వివరాలు గ్రామ సభలో చదివి వినిపించాలన్నారు. నమూనా-3లో భాగంగా వారసత్వం, రిజిస్ట్రేషన్ కాకుండా ఇతర బదిలీల వివరాలను గ్రామసభలో అడంగల్‌లో చదివి రికార్డు చేయాలన్నారు. వాటిని తహశీల్దార్ మ్యుటేషన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నమూనా-4లో భాగంగా డూప్లికేట్ ఖాతాలను తొలగించాలని, నిర్ధారించుకున్న తరువాతే తొలగించాలన్నారు. నమూనా-5లో భాగంగా కొంతమంది భూ యజమానులకు నోషనల్‌ఖాతా నెంబర్లను కేటాయించామని, వాటిని రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లోనూ ఎనిమిదేసి మండలాల్లో ఒక ఆధునిక స్టోరేజ్ రూమ్‌లను నిర్మించాలని, ఈ ప్రక్రియ సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. యూసీలు సమర్పిస్తే, కేంద్ర ప్రభుత్వం 103 కోట్ల రూపాయల మేర అదనపు గ్రాంట్ మంజూరు చేస్తుందని తెలిపారు.

చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్