ఆంధ్రప్రదేశ్‌

హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులకు ఉద్యోగాలు ఇవ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, ఆగస్టు 21: హిందూ సమాజం యొక్క ధార్మిక కేంద్రాలైన దైవ క్షేత్రాల్లో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం కర్నూలు నగరంలోని వీహెచ్‌పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడు రోజులుగా పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో జరుగుతున్న పరిణామాలను హిందువులు గమనిస్తున్నారన్నారు. హిందూ దేవాలయాల్లో ఈమధ్య విపరీతమైన ధోరణులు జరుగుతున్నాయని అన్నారు. హిందూ దేవాలయాల్లో ఇతర మతస్తులను ఉద్యోగులుగా ఉండటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఇతర మతాల సంస్థల్లో హిందువులు చేరే అవకాశం లేదన్నారు. అయితే ప్రభుత్వంలో భాగమైన దేవదాయ ధర్మదాయశాఖ ఆధ్వర్యంలో నడిచే అన్ని ప్రధాన దేవాలయాల్లో ఇతర మతస్తులు ఉద్యోగులుగా చేరుతున్నారన్నారు. శ్రీశైలం దేవస్థానంలో ఇతర మతస్తులు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారని, వారికి హిందూ దేవతలపై నమ్మకం గానీ భక్తిప్రపత్తులు గానీ ఉండవని తెలిపారు. కాబట్టి అలాంటి వారిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో వీహెచ్‌పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాళిగి వ్యాసరాజ్, రాష్ట్ర కోశాధికారి సందడి మహేశ్వర్, జిల్లా గౌరవ అధ్యక్షులు కేవీఆర్.శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వాసుదేవయ్య, రాష్ట్ర బజరంగ్‌దళ్ కో-కన్వీనర్ ప్రతాప్‌రెడ్డి, విభాగ్ కార్యదర్శి గూడ సుబ్రమణ్యం, జిల్లా కార్యదర్శి తుంగారమేష్, కోశాధికారి శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్ష, కార్యదర్శులు లక్కిరెడ్డి అమరసింహారెడ్డి, మాళిగి భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...నందిరెడ్డి సాయిరెడ్డి