ఆంధ్రప్రదేశ్‌

రాజధానిని మార్చేందుకు జగన్ తుగ్లక్ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 21: రాజధానిని అమరావతి నుంచి మార్చే ప్రయత్నం చేసేందుకు మహమ్మద్ బీన్ తుగ్లక్ మాదిరిగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పిచ్చివాడు కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వెంటనే రాజధాని విషయంపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బుధవారం సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి రామకృష్ణ వినతిపత్రం అందజేశారు. ఇసుక సమస్యతో కార్మికుల కష్టాలను వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయుసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయటంతోపాటు, విజయవాడ నగర సమితి నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించామన్నారు. గతంలో రూ. 1800లకు దొరికే ఇసుక ట్రాక్టర్ ప్రస్తుతం రూ. 8వేలు పలుకుతోందన్నారు. సాధారణ, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇసుక గురించి రివ్యూ చేశామని చెప్పారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వంద రీచ్‌లలో ఇసుక సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారన్నారు. అలాగే సెప్టెంబర్ 5వ తేదీన కొత్త పాలసీ ప్రకటిస్తామని స్పష్టం చేశారన్నారు. రాజధాని విషయంలో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై రామకృష్ణ స్పందిస్తూ రాజధానిలో ఏమీ మునగలేదని, అంతటా బాగానే ఉందన్నారు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు. తుగ్లక్ ఢిల్లీ నుండి దౌలతాబాద్‌కి, దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి రాజధాని మార్చాడని చెప్పారు.
అయితే జగన్‌మోహన్‌రెడ్డి మహమ్మద్ బీన్ తుగ్లక్ మాదిరిగా కాదని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబులేసు మాట్లాడుతూ క్యూబిక్ మీటర్ ఇసుక రూ. 600గా నిర్ణయించారని ఈ క్రమంలో ఇంటికి చేరే సరికి 3 నుంచి 5వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని అన్నారు. ఇసుక ధరను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి శంకర్ తదితరులు పాల్గొన్నారు.