ఆంధ్రప్రదేశ్‌

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 20: ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం శంకరనారాయణ తెలిపారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బీసీ సంక్షేమ పథకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. బీసీ సంక్షేమ శాఖ కార్పొరేషన్ల ద్వారా రాజకీయాల కతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల బీసీలకు అన్యాయం జరిగిందని తెలిపారు. సంక్షేమ పథకాల కోసం కొత్తగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. గత ప్రభుత్వం రూ. 1432 కోట్లు ఇతర శాఖలకు మళ్లించిందని తెలిపారు.
బీసీ సంక్షేమ హాస్టళ్లకు రెండేళ్లుగా అద్దెలు చెల్లించలేదని వెల్లడించారు. బ్యాంకులతో రుణాల ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఆదరణ పథకంతోపాటు ఇతర అక్రమాలపై విచారణ చేస్తున్నామని వెల్లడించారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. కొన్ని కోచింగ్ సెంటర్లు విద్యార్థులకు సరైన శిక్షణ అందించకుండా నిధులు తీసుకున్నాయన్న అభియోగాలున్నాయని వాటిపై విచారణ జరిపిస్తున్నామన్నారు. తాము బడ్జెట్‌లో బీసీలకు రూ. 15,061 కోట్లు, కాపులకు రూ. 2వేల కోట్లు కేటాయించామని తెలిపారు.
అర్హులనే ఎంపిక చేయాలి
కుల, వివిధ వృత్తుల పరికరాల పంపిణీకి అర్హులైన వారినే ఎంపిక చేయాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆదేశించారు. మంగళవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, తదితర అధికారులతో వెలగపూడి సచివాలయంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాల వారీగా డిమాండ్ ఉండే కొత్త యూనిట్లు గుర్తింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. పథకాల అమలులో వాస్తవ లబ్ధిదారులకు మేలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్ల స్థాపనపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలన్నారు. లబ్ధిదారుల స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని యూనిట్లు గ్రౌండింగ్ చేస్తారని, ఈ విషయంపై అటు బ్యాంకర్లతో పాటు లబ్ధిదారులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి నెలా మొదటి వారంలో ఈడీ, తదితర అధికారులతో జిల్లాల్లో సమావేశం నిర్వహించాలన్నారు. లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా చిన్న, మధ్య తరహా యూనిట్ల స్థాపనపై దృష్టి పెట్టాలన్నారు. వ్యవసాయ, అనుబంధం రంగాలు, రవాణా రంగం, కంప్యూటర్ విడి పరికరాలు అమ్మకాలు, సర్వీసింగ్, సెలూన్‌లు తదితర ప్రాజెక్టుల విషయం పై దృష్టి సారించాలన్నారు.

చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శంకరనారాయణ