ఆంధ్రప్రదేశ్‌

2024 ఎన్నికలే లక్ష్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు, ఆగస్టు 20: సిద్ధాంతాలు కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అని, 2024లో జరిగే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త శ్రమించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం కృష్ణాజిల్లా కైకలూరు సీతారామ ఫంక్షన్ హాలులో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేంపాటి విష్ణురావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలన్నారు. 2014 ఎన్నికల్లో విజయం తరువాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 136 పథకాలు ప్రవేశ పెట్టి దేశంలో పేదలు లేకుండా చేయాలనే లక్ష్యంగా పని చేసి 2019 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. అవినీతి ఆరోపణల మీద జైలుకు వెళ్లిన జగన్ అవినీతిరహిత పాలన అందిస్తానని చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 10వేల సభ్యత్వం చేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ తాను అండగా నిలబడతానన్నారు. కాలువలకు సాగునీరు విడుదల చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దళితులకు పెద్ద పీట వేసి, వారి కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీలో చేరి కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి, కైకలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కీర్తి వెంకటరామ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.