ఆంధ్రప్రదేశ్‌

డీజీపీ వ్యాఖ్యలు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 20: ఉండవల్లి కరకట్టపై రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై ఇద్దరు ఆగంతకులు ఎటువంటి అనుమతులు లేకుంతా డ్రోన్ల కెమెరాలతో చిత్రీకరించటం వెనుక ఎలాంటి కుట్ర లేదని, దీనిని రాజకీయం చేయవద్దని డీజీపీ గౌతం సవాంగ్ చెప్పటం తగదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయవాడ టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ అనుమతుల్లేకుండా చిత్రీకరించడం తప్పని గుంటూరు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, గుంటూరు ఎస్పీ తదితర పోలీసు అధికారులందరూ కూడా చెబుతుంటే డీజీపీ కుట్రలేదు, దీనిపై రాజకీయం చేయకూడదని చెప్పడం చూస్తుంటే ఆయన ఏకపక్షంగా మాట్లాడుతున్నట్లుగా ఉందన్నారు. ఆ రోజు చంద్రబాబు ఇంటి వద్ద సెక్యూరిటీ అధికారులు పారిపోతున్న ఆ ఇద్దరు ఆగంతకులను పట్టుకుని తాడేపల్లి సీఐకు అప్పగిస్తే వారు సరైన రీతిలో స్పందించకపోతే అక్కడ గుమిగూడిన టీడీపీ నాయకులు, కార్యకర్తలందూ కూడా పోలీసులపైన ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవమేని వర్ల అన్నారు. ఆనాడు టీడీపీ కార్యకర్తలెవరూ పోలీసుల మీద, వారి వాహనాలపై రాళ్లు విసరలేదని, ఎలాంటి దాడి చేయలేదన్నారు. వారిపై కేసులు ఉపసంహరించుకోవాలన్నారు.