ఆంధ్రప్రదేశ్‌

రైల్వే ప్రాజెక్టుల భూసేకరణకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 20: రాష్ట్రంలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్‌మాల్యాతో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై మంగళవారం సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. ఇప్పటికే రైల్వే శాఖ చేపట్టిన 17 ఆర్వోబీల అప్రోచ్ రోడ్డు నిర్మాణ వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉందని, అంత వరకు భరిస్తామన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా భవిష్యత్తులో నిర్మించే ఆర్వోబీల అప్రోచ్ రోడ్ల నిర్మాణ వ్యయాన్ని రైల్వే శాఖే భరించాలని కోరారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ను అన్ని విధాల ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాల్సి ఉందని, ఇందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించి, అమలు చేయాలని కోరారు. రైల్వే స్టేషన్ విస్తరణకు వీలుగా అక్కడ ఉన్న రెండు సత్రాలను ఖాళీ చేసి, రైల్వేకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్, టీటీడీ అధికారులను కోరారు. వివిధ రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూములను సేకరించి తమకు అప్పగించాలని ఈ సందర్భంగా గజానన్ కోరారు.