ఆంధ్రప్రదేశ్‌

అగ్రవర్ణ పేదలంటే మీకు అలుసెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 20: రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలంటే ముఖ్యమంత్రికి అలుసెందుకని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి ప్రశ్నించారు. సోమవారం నగరంలోని పీసీసీ కార్యాలయం ఆంధ్రరత్నభవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగ్రవర్ణ పేదలకు ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10శాతం రిజర్వేషన్ అమలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి శోచనీయమన్నారు. ఈ చట్టం వచ్చి ఏడు నెలలవుతున్నా రాష్ట్రంలో అమలుకావడం లేదని, విద్య విషయంలో అమలవుతున్నా, ఉద్యోగాల విషయంలో పాటించడం లేదన్నారు. గ్రామ వలంటీర్ల ఎంపికలో కూడా ఈడబ్ల్యూఎస్ అమలుకాలేదన్నారు. అంతేకాకుండా త్వరలో భర్తీకానున్న గ్రామ సచివాలయ నియామకాల్లో కూడా ఈ విషయంపై సరైన స్పష్టత లేదన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, తెలగ, బలిజ, ఒంటరి తదితర అగ్రవర్ణ కులాల్లోని పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పాటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి అండగా నిలిచి న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు.