ఆంధ్రప్రదేశ్‌

వరదపై బురద రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 19: కృష్ణానదికి వరద నేపథ్యంలో వరద, డ్రోన్ రాజకీయాలు తెరపైకి తెచ్చి పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండటం జుగుప్స కలిగిస్తోందని, ఈ బురద రాజకీయాలు మాని ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తక్షణం సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు హితవు పలికారు. సోమవారం అనంతపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రజాసమస్యల్ని ప్రతిపక్ష టీడీపీ, ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఓవైపు రాయలసీమతో పాటు పలు జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం, మరోవైపు కృష్ణాజలాలు రావడంతో వరద పోటెత్తి బీభత్సం సృష్టిస్తుంటే ఓట్ల రాజకీయాలతో అసహ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈసారి వర్షాలు వస్తాయో రావో, ప్రాజెక్టులు నిండుతాయో లేదో, కనీసం తాగునీరైనా లభిస్తుందో, లేదో, రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్న తరుణంలో కృష్ణానది పరవళ్లు తొక్కడం, ప్రాజెక్టులు నిండడం అదృష్టమన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వందకు పైగా లంక గ్రామాలు నీట మునిగి ప్రజలు, రైతులు నానా అవస్థలు పడుతుంటే ఆదుకోకపోగా వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ నాయకులు బురద రాజకీయాలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. సీఎం అమెరికా పర్యటనకు వెళ్లగా, మాజీ సీఎం చంద్రబాబు హైదరాబాదులో కూర్చోవడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. యువ సీఎం జగన్‌కు 150 రోజుల వరకూ సహకారం ఇస్తామని ఆయన అన్నారు. అప్పటి వరకూ రాజకీయాలు చేయబోమని స్పష్టం చేశారు. 2023లో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెబుతున్నారని, అయితే కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఏమేరకు నిధులు తెప్పించారో చెప్పలేదని విమర్శించారు. సీమ ప్రాంతాన్ని ఆదుకుంటామని బీజేపీ నేతలు చెప్పడం లేదని ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీలు, లౌకిక పార్టీలు కలిసి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధమన్నారు.