ఆంధ్రప్రదేశ్‌

కొండలరాయుడికి తేళ్లతో పూజలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు, ఆగస్టు 19: తేలును చూడగానే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటి తేళ్లను తలపైన, నోట్లే వేసుకుంటే ఇంకేమన్నా ఉందా.. అయితే కర్నూలు జిల్లా కోడుమూరువాసులు మాత్రం శ్రావణమాసంలో సమీపంలోని కొండపై కనిపించే తేళ్లతో ఆడుకుంటారు. వాటిని పట్టుకుని తల, ఒంటిపై వేసుకుంటారు. నోట్లో పెట్టుకుంటారు. అయినా ఆ తేళ్లు ఏమీ చేయవు. ఇదంతా కొండలరాయుడి మహత్యం అని చెబుతారు. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా కోడుమూరు శివారులోని కొండపై కొలువైన శ్రీ కొండల రాయుడికి శ్రావణమాసం 3వ సోమవారం భక్తులు తేళ్లతో పూజలు చేస్తారు. చిన్నాపెద్దా అంతా కలిసి కొండపైకి చేరుకుంటారు. అక్కడ రాళ్లకింద తేళ్ల కోసం వెతుకుతారు. తేలు కనిపించగానే తోకకు దారం కట్టి స్వామి విగ్రహంపై ఉంచి పూజలు చేస్తారు. అనంతరం వాటిని తల, ఒంటిపై వేసుకుంటారు. మరికొందరు నోట్లో పెట్టుకుంటారు. ఈరోజు తేళ్లు అస్సలు కుట్టవని, ఒకవేళ కుట్టినా విషం ఎక్కదని భక్తులు చెబుతుంటారు. ఇదంతా స్వామి మహత్యం అని కొనియాడుతుంటారు.