ఆంధ్రప్రదేశ్‌

గేట్లు తెరవక ముందే బాబు పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఆగస్టు 19: వరద నీటిలో మునిగిన ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటిని డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తే హత్యకు కుట్ర పన్నినట్లా అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వరద వస్తే తన పరువు గంగ పాలవుతుందని ముందే ఉహించిన చంద్రబాబు బ్యారేజీ గేట్లు తెరవక ముందే హైదరాబాద్ పరారయ్యారని సోమవారం ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇంట్లోని విలువైన వస్తువులను అప్పటికే తరలించారన్నారు. ఇలాఉంటే చంద్రబాబు బీజేపీని వదిలి పెట్టాక ఆయనకున్న కుల మీడియా బీజేపీని ఒక విలన్‌గా చిత్రీకరించిందని విజయసాయిరెడ్డి విమర్శించారు. మొన్నటి దాకా మోదీని రాష్ట్ర శత్రువుగా ఎల్లో మీడియా ముద్ర వేసిందన్నారు. ఇప్పుడు పచ్చ పార్టీ నాయకులంతా బీజేపీలో దూకుతుండటంతో ఎల్లో మీడియాకు పెద్ద చిక్కొచ్చి పడిందని ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితుల్లో ఎల్లో మీడియాకు రివర్స్ గేర్ వేయక తప్పడం లేదన్నారు. గతంలో వరదలు, తుపాన్లు వస్తే చంద్రబాబు వన్‌మ్యాన్ షో నడిచిందన్నారు. కలెక్టర్లపై బాబు ఆగ్రహం, సీఎం వచ్చే దాకా కదలని అధికార గణం అంటూ కుల మీడియా ఆయనను ఆకాశానికెత్తేదన్నారు. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని, అయితే తిట్లు, సస్పెన్షన్లు లేనే లేవని విజయసాయిరెడ్డి వివరించారు.