ఆంధ్రప్రదేశ్‌

అమెరికా నుంచి రాగానే ప్రజల్లోకి జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 19: వరదలు, పోలవరం టెండర్ల రద్దు, అన్న క్యాంటీన్‌లు మూసివేత తదితర అంశాలపై గడచిన కొద్ది రోజులుగా విపక్ష నేతలు పెద్దస్థాయిలో ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దూకుడు పెంచనున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత ప్రజల్లోకి వెళ్లి దూకుడు పెంచేలా సలహాదారులు వ్యూహరచన కావిస్తున్నారు. ప్రధానంగా వివిధ పథకాల లబ్ధిదారులతో మమేకమయ్యేలా పలు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలు నిర్వహించడంతోపాటు అంతకు ముందు నుంచే ఎన్నికల మేనిఫెస్టోలోని వివిధ అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని భావిస్తున్నారు.
ఇందుకోసం అధికార యంత్రాంగంతోపాటు వైకాపా నేతలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే దాదాపు అన్ని శాఖలపైనా సమీక్షలు నిర్వహించారు. పైగా వాటిలోని లోటుపాట్లను కూడా సలహాదారులతో కలిసి పరిశీలించారు. దాదాపు గత మూడు మాసాల నుంచి జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచే ఈ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఇక జనంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. తన విధానాలను నేరుగా ప్రజల్లోకి వివరించేందుకు తగు సన్నాహాలు చేసుకుంటున్నారు. రచ్చబండ పేరిట రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ పర్యటించబోతున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్‌లకు ఇప్పటికే ఆదేశాలు అందినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కార్యక్రమం సెప్టెంబర్ రెండో తేదీ చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.